వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. దేశంలో పెరుగుతున్న కోవిద్ కేసులకు ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తూ వర్మ గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే కుంభమేళా పెట్టడం అంత అవసరమా అని ప్రశ్నించాడు.
ఇక ఇప్పుడు డైరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే విమర్శలు చేస్తున్నాడు వర్మ. అంతర్జాతీయ పత్రికలు సైతం మోదీ తీరుని విమర్శించడాన్ని పాయింట్ అవుట్ చేసాడు. కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు అల్లాడుతుంటే ఎలెక్షన్ క్యాంపైన్ లో పాల్గొనడమేంటా అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నిస్తున్నాడు.
రోజూ ఈ టాపిక్ మీదే వర్మ పోస్టులు పెడుతున్నాడు. ఇవి కాక తన సినిమాల పనుల్లో కూడా నిమగ్నమై ఉన్నాడు వర్మ. ప్రస్తుతం పలు ప్రాజెక్టులపై వర్క్ చేస్తున్నాడు.