Advertisement

‘భీమ్లానాయక్’ ఒక మెరుపు.. పవన్ కల్యాణ్ ఓ సునామీ

Posted : February 25, 2022 at 3:08 pm IST by ManaTeluguMovies

పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మాస్ మసాలా యాక్షన్ థండర్ `భీమ్లానాయక్`. గత కొంత కాలంగా పవన్ నుంచి ఎలాంటి సినిమా కావాలని అభిమానులు కోరుకుంటున్నారో అదే స్థాయి చిత్రాన్ని ఈ మూవీతో పవన్ ఫ్యాన్స్ కి అందించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా `భీమ్లా నాయక్` చర్చే నడుస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా హల్ చల్ చేస్తోంది.

పవర్ ఫుల్ పాత్రలో పవన్ కనిపించిన తీరుకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు పవన్ పై `భీమ్లా నాయక్` పై ఉదయం నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా అందించిన ట్విట్టర్ రివ్యూ వైరల్ గా మారి అభిమానుల్లో జోష్ ని నింపేసింది. తొలి షో నుంచి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ అప్పుడే సెలబ్రేషన్స్ మోడ్ లోకి వెళ్లి నెట్టింట థియేటర్ల వద్ద హంగామా చేస్తూ ఖుషీ ఫీలవుతున్నారు.

`గబ్బర్ సింగ్ ` తరువాత మరోసారి అంతకు మించిన మాస్ పవర్ ఫుల్ పాత్రలో పవన్ నటించడంతో `భీమ్లానాయక్`పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా `భీమ్లానాయక్`పై సంచలన ట్వీట్ ని షేర్ చేశారు. సినిమా రిలీజ్ ముందు నుంచే ట్విట్టర్ వేదికగా సినిమాపై పవన్ పై సెటైర్లు వేస్తూ వస్తున్న వర్మ.. ట్రైలర్ పై కూడా ఓ రేంజ్ లో సెటైర్లు వేసి ఫ్యాన్స్ కి ఆగ్రహాన్ని తెప్పించారు. `భీమ్లా నాయక్` అని కాకుండా `డేనియల్ శేఖర్` అని పెట్టివుంటే బాగుండేదని మరో బాంబ్ పేల్చారు.

అయితే తాజాగా వర్మ తన స్వరం మార్చారు. ఎన్నడూ లూని విధంగా పవన్ పై ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఎప్పుడూ మెగా ఫ్యామిలీని పవన్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ లు చేసే వర్మ తాజాగా తన పంథాను మార్చుకుని పవన్ ని ఆకాశానికి ఎత్తేయడం ఆసక్తికరంగా మారింది. వర్మ తాజా ట్వీట్ లో `భీమ్లా నాయక్`పై ప్రశంసల వర్షం కురిపించాడు. శుక్రవారం వర్మ భీమ్లానాయక్పై పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపించాడు. `నును ముందు నుంచి చెబుతున్నట్టు `భీమ్లానాయక్` సినిమాను హిందీలోనూ విడుదల చేయాలి. ఈ సినిమా హిందీలో ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది` అంటూ ట్వీటేశాడు.

అంతే కాకుండా `భీమ్లానాయక్` ఒక మెరుపు.. పవన్ కల్యాణ్ సునామి. రానా కూడా పవన్ తో పోటీపడి నటించారు. మొత్తం మీద `భీమ్లానాయక్` భూకంపాన్ని సృష్టించింది` అంటూ పొగడ్తల వర్షం కురిపించారు వర్మ. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఉన్నట్టుండి వర్మ పాజిటివ్ గా ట్వీట్లు చేయడం తో ఎంతలో ఇంత మార్పు ఏమిటో అని అంతా అవాక్కవుతున్నారు. `భీమ్లానాయక్` మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా రూపొందిన విషయం తెలిసిందే. రానా నిత్యామీనన్ సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటించారు.


Advertisement

Recent Random Post:

విదేశాలకు పారిపోయేందుకు పిన్నెల్లి ప్లాన్ చేసినట్లు పోలీసుల అనుమానాలు | Pinnelli Ramakrishna Reddy

Posted : May 22, 2024 at 5:37 pm IST by ManaTeluguMovies

విదేశాలకు పారిపోయేందుకు పిన్నెల్లి ప్లాన్ చేసినట్లు పోలీసుల అనుమానాలు | Pinnelli Ramakrishna Reddy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement