Advertisement

రామ్‌, లింగుస్వామి మూవీ బడ్జెట్‌ పై పుకార్లే పుకార్లు

Posted : February 27, 2021 at 4:42 pm IST by ManaTeluguMovies

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ తో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాడు అనుకుంటున్న సమయంలోనే రెడ్‌ సినిమాతో నిరాశ పర్చాడు. ఏడాది గ్యాప్ తీసుకున్న రామ్‌ తాజాగా తన కొత్త సినిమాను కన్ఫర్మ్‌ చేశాడు. తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో ఈయన సినిమాను చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇలాంటి సమయంలో రామ్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా బడ్జెట్‌ అంతా ఇంతా అంటూ పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రామ్‌ మార్కెట్‌ ప్రకారం రూ.20 నుండి రూ.25 కోట్ల వరకు పెట్టుబడి పెడితే పర్వాలేదు. కాని అంతకు మించి బడ్జెట్‌ పెడితే మాత్రం ఖచ్చితంగా అది ఓవర్‌ బడ్జెట్‌ అవుతుంది.

ఆ విషయం తెలిసి కూడా రామ్‌ మరియు లింగు స్వామిల ప్రాజెక్ట్‌ కు నిర్మాతలు ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ద్వి భాష చిత్రంగా రూపొందుతున్న సినిమా అవ్వడం వల్ల ఈ రేంజ్ లో బడ్జెట్‌ అవుతుందని కొందరు అంటున్నారు. ఎంత ద్వి భాష చిత్రం అయినా రామ్‌ సినిమాకు ఆ రేంజ్ లో ఖర్చు పెట్టడం అంటే పిచ్చి నిర్ణయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు విమర్శలు వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఇది పుకార్లే అయ్యి ఉంటాయని అంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

ఎన్నికల వేళ మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ | Big Blow To Mamata Government

Posted : April 23, 2024 at 11:42 am IST by ManaTeluguMovies

ఎన్నికల వేళ మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ | Big Blow To Mamata Government

-https://www.youtube.com/watch?v=6wbRwUD6XsE

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement