‘ఇంట్లోవాడని చెప్పడం లేదు. అడవి మనిషి పాత్రలో రానా జీవించేశాడు. మూడేళ్లు ఈ ప్రాజెక్టు మీదే వర్క్ చేశాడు. నటులకు ఎప్పుడూ గొప్ప పాత్రలు రావు. లీడర్, ఘాజీ, బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి, కృష్ణం వందే జగద్గురుమ్.. వంటి డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఏదో నేర్చుకుంటున్నాడు అనుకున్నా కానీ.. అరణ్యలో మొదటి ఫ్రేమ్ నుంచీ అదరగొట్టేశాడు. ఇప్పుడు నాకు సవాల్ ఎదురైంది. ఏదో అనుకున్నారా.. ఎదిగిపోయావ్’ అని వెంకటేశ్ ఎమోషనల్ అయ్యారు.
ఈనెల 26న విడుదలవుతున్న అరణ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు శేఖర్ కమ్ములతో కలసి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రకృతితో మనం ఆడుకుంటే ఏం జరుగుతుందో సినిమాలో దర్శకుడు బాగా చూపించాడు. అడవిలో షూటింగ్ మామూలు విషయం కాదు. ఎనుగుల్లో కూడా నటన చూపించారు. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా అరణ్య. రానా కష్టం ప్రతి ఫ్రములో కనిపిస్తుందిన అన్నారు.