Advertisement

నా పెళ్లి గురించి ఎప్పటికీ చెప్పను

Posted : April 15, 2020 at 4:14 pm IST by ManaTeluguMovies

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది యాంకర్ రష్మి. అందరిలా సైలెంట్‌గా కాకుండా ట్రోల్ చేయాలని చూసినవారికి చాలా క్లియర్‌గా బోల్డ్‌ ఆనర్స్ ఇస్తూ ఉంటుంది ఈ జబర్ధస్త్ యాంకర్. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో మసాలా ఫోటోలు షేర్ చేయకుండా, తను చేస్తున్న కమ్యూనిటి సర్వీస్ గురించి హైలైట్ చేసుకుంటూ అందరినీ బాగా ఆకర్షిస్తోందీ యాంకరమ్మ. అయితే మరోసారి తన ట్రేడ్ మార్క్ సెటైర్ తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది రష్మి గౌతమ్.

తాజాగా ట్విట్టర్‌లో ఓ అభిమాని… ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని రష్మిని ప్రశ్నించాడు. దానికి అందరిలా టైమ్ వచ్చినప్పుడు చెబుతానని కామన్ ఆన్సర్ ఇవ్వకుండా… ‘పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ అనే అర్థం. నా ప్రొఫెషనల్ విషయాల గురించి, కమ్యూనిటీ సర్వీస్ గురించి అడగండి చెబుతాను… మిగిలినవన్నీ నా పర్సనల్స్’ అంటూ ఫుల్లు క్లారిటీతో ఆన్సర్ ఇచ్చింది రష్మి. తన పెళ్లి గురించి, ప్రేమ వ్యవహారాల గురించి ఎవ్వరికీ చెప్పడం తనకి ఇష్టం లేదని అలాగే ఎవ్వరూ దాని గురించి ఆడగకూడదని కూడా సెలవిచ్చింది.

మరో ప్రక్కన లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వీధికుక్కలకు ఆహారం పెడుతోన్న రష్మి, కొందరు కమ్యూనిటీ సభ్యులతో కలిసి మూగజీవుల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. సాధ్యమైనంత వరకు చాలామంది ఈ విధంగా కమ్యూనిటీ సేవ చేయాలని కోరుతోంది. ఇకపోతే రష్మి దగ్గర నుండి గ్లామర్ ట్రీట్ ఆశించేవారు మాత్రం మళ్ళీ జబర్ దస్త్ షూటింగ్ మొదలయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.


Advertisement

Recent Random Post:

పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా OG..OG అంటూ ఫ్యాన్స్ కేకలు l Deputy CM Pawan Kalyan l OG Movie

Posted : November 1, 2024 at 6:53 pm IST by ManaTeluguMovies

పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా OG..OG అంటూ ఫ్యాన్స్ కేకలు l Deputy CM Pawan Kalyan l OG Movie

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad