Advertisement

చొక్కా లేకుండా అబ్బాయిలు చూపిస్తారెందుకు?

Posted : November 13, 2021 at 2:53 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ లో ఛలో చిత్రంతో తెరంగేట్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక మందన కోలీవుడ్ లో సుల్తాన్ చిత్రంతో రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ నాయికగా వెలిగిపోతున్నా కోలీవుడ్ ఆరంగేట్రం ఆశించినంత హిట్ కాలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తోంది. రష్మిక మందన్న నటించిన బాలీవుడ్ తొలి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో రష్మిక మందన్న ఒక యువకుడితో డేటింగ్ చేయడంపై తన అభిప్రాయం వెల్లడించింది. .

ప్రేమించడానికి వయసు పట్టింపు లేదు. నా వయసు కూడా మరీ ఎక్కువ అని నేను అనుకోవడం లేదు. మనకంటే చిన్న వయసు కుర్రాళ్లతో డేటింగ్ చేయొచ్చు .. అంటూ రష్మిక మందన తెలిపింది. ఈ విషయంలో తనకు ఎలాంటి పట్టింపు లేదని అంది. ఇటీవలే తన బాలీవుడ్ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని ముంబైలోని తన కొత్త అపార్ట్ మెంట్ కి రష్మిక షిఫ్ట్ అయ్యింది.

అలాగే మల్టిపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ `కుర్రాళ్ల షర్ట్ లెస్ డిస్ప్లే` యాటిట్యూడ్ పైనా ముచ్చటించింది. నాకు ఎందుకో అర్థం కాలేదు. అబ్బాయిలు వర్కవుట్ చేయడం ఫిట్ గా కనిపించడం వంటి వాటిని నేను నిజంగా అభినందిస్తున్నాను. యూత్ ఎంత అంకితభావంతో ఉన్నారో అది తెలియజేస్తుంది. కానీ ఈ ఫిట్ బాడీని మీ ప్రొఫైల్ ఫోటోగా ఎందుకు ఉంచాలనుకుంటున్నారు? అని ప్రశ్నించింది. ఇతరులు మీ శరీర ధృఢత్వాన్ని చూసే దశకు చేరుకోవడానికి మిమ్మల్ని తెలుసుకునేలా చేయండి. నేను మరీ ఓల్డ్ క్లాస్ ఆలోచనలతో ఉంటాను.. అని తెలిపింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే .. రష్మిక అల్లు అర్జున్ సరసన నటించిన `పుష్ప – ది రైజ్` విడుదల కోసం వేచి ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన బాలీవుడ్ లో తొలి చిత్రం `మిషన్ మజ్ను` షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అమితాబ్ తో కలిసి `గుడ్ బాయ్` అనే చిత్రంలో నటిస్తోంది.


Advertisement

Recent Random Post:

బీజేపీలో ఆమెకు ఎందుకంత ప్రాధాన్యం.? l Madhavi Latha l Off the Record

Posted : April 19, 2024 at 8:57 pm IST by ManaTeluguMovies

బీజేపీలో ఆమెకు ఎందుకంత ప్రాధాన్యం.? l Madhavi Latha l Off the Record

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement