Advertisement

శ్రీవల్లి ఇమేజ్ తో రష్మిక ఐటం ఆఫర్!

Posted : March 14, 2022 at 10:26 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ లో పాగా వేయాలని హాట్ బ్యూటీ రష్మిక మందన్న సీరియస్ ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది. టాలీవుడ్ లో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బ్యూటీ ఉత్తరాదినా సత్తా చాటాలని వెయిట్ చేస్తోంది. ఇటీవలే ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్రతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఫేమస్ అయింది. ‘సామీ సామీ’ అంటూనే పాన్ ఇండియా ని మించి పాన్ వరల్డ్ లో రీచ్ అయింది. ఇప్పుడు రష్మిక అంటే తెలియని అభిమాని లేడు. ఆమెకంటూ సపరేట్ ట్రాక్ క్రియేట్ అయింది. ఒక్క తెలుగు సినిమా రష్మిక కెరీర్ నే టర్న్ చేసింది.

తనదైన చలాకీతనం..స్పీడ్ తో యువతని ఇట్టే ఆకట్టుకునే లక్షణం అమ్మడి ప్రత్యేకత. ఇలా ఇన్ని క్వాలిటీలు గల బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ లో బంఫర్ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్న బ్యూటీకి అప్పుడే ఐటం సాంగ్ లో నటించే అవకాశాలు సైతం తలుపుతడుతున్నాయని సమాచారం. టాలీవుడ్ స్టార్ మేకర్ సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో ఓ ఐటం పాటలో నటించడానికి రష్మిక తో చర్చలు జరుపుతున్నారుట. రష్మిక ఛరిష్మా ఆ పాటకు అడ్వాంటేజ్ అవుతుందని సందీప్ భావిస్తున్నాడుట. ఈ నేపథ్యంలో రష్మికని తీసుకునే దిశగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ వెనుక రష్మిక పాన్ ఇండియా క్రేజ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ‘పుష్ప’ పాటతో బ్యూటీ బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయింది. పిట్ట చిన్నదే అయినా కూత గనం అన్న మాదిరిగా వెలిగిపోయింది.

ఉత్తరాది అభిమానుల హృదయాల్ని తొలి సినిమాతోనే కొల్లగొట్టింది. రష్మికకి ఇప్పుడు అక్కడ మంచి ఫ్యాన్స్ ఉన్నారు. హిందీ బెల్డ్ లో ‘పుష్ప’ భారీ వసూళ్లు సాధించిందటే కారణంగా రష్మిక మార్క్ పెర్పార్మెన్స్ కీ రోల్ పోషిందని చెప్పొచ్చు.

ఇప్పుడా క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునేలా సందీప్ ఇలా యానిమల్ లో ఐటం భామగా ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలుగు మేకర్ రష్మికని బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు.

మరి ఈ ఆఫర్ ని రష్మిక యాక్సెప్ట్ చేస్తుందా? రిజెక్ట్ చేస్తుందా? అన్నది చూడాలి. రష్మిక బాలీవుడ్ లో పెద్ద హీరోయిన అవ్వాలని కలలు కంటోంది. హిందీ పరిశ్రమలోనే స్థిరపడాలి అన్న ప్లాన్ లో ఉంది. మరి ఇలాంటి ప్లానింగ్ నేపథ్యంలో కెరీర్ ఆరంభంలోనే ఐటం గాళ్ అనే ముద్ర పడుతుందని వెనక్కి తగ్గుంతుందా? లేక ఆ ఇమేజ్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక వివిధ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిందీలో ‘మిషన్ మజ్ను’.. ‘గుడ్ బై’ చిత్రాల్లో నటిస్తోంది.


Advertisement

Recent Random Post:

TDP లీడర్స్ ఆ YCP నేతకు లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నారా? | OTR

Posted : July 3, 2024 at 12:11 pm IST by ManaTeluguMovies

TDP లీడర్స్ ఆ YCP నేతకు లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నారా? | OTR

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement