Advertisement

మాస్ మహారాజా సినిమాలో మెగా హీరో?

Posted : May 18, 2020 at 3:19 pm IST by ManaTeluguMovies

అసలు ఫామ్ లో లేని మాస్ మహారాజా రవితేజ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కో రాజా కూడా దారుణమైన ఫలితాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ చిత్రంలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే ఈపాటికి క్రాక్ రిలీజై ఉండేది కూడా.

అయితే రవితేజ క్రాక్ సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. పూర్తి ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం మెగా హీరోను అనుకుంటున్నారట. అది ఎవరో కాదు, రీసెంట్ సక్సెస్ లతో దూసుకుపోతున్న సాయి తేజ్. గతేడాది చిత్రలహరి, ప్రతిరోజూ పండగే చిత్రాల ద్వారా సూపర్ హిట్స్ తో ఉన్న సాయి తేజ్, వేరే హీరో సినిమాలో స్పెషల్ రోల్ చేస్తాడా అన్నది చూడాలి. అయితే సాయి తేజ్ కు రవితేజ ఫేవరెట్ హీరో. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పాడు. మరి ఈ అవకాశాన్ని సాయి తేజ్ వదులుకోకపోవచ్చు.

ప్రస్తుతం సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరు అనే చిత్రంలో నటిస్తున్నాడు. మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

Jabardasth Latest Promo – 25th April 2024 – Indraja,Siri Hanmanth,Rocket Raghava,Saddam,Indraja

Posted : April 24, 2024 at 2:11 pm IST by ManaTeluguMovies

Jabardasth Latest Promo – 25th April 2024 – Indraja,Siri Hanmanth,Rocket Raghava,Saddam,Indraja

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement