ఈ ఏడాది మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ కొనుగోలు చేశారు.. అక్కడి నుంచి ఈ సినిమాలో నటించబోయే హీరోస్ లో బాలకృష్ణ, వెంకటేష్, నాని ఇలా చాలా పేర్లే వినిపించాయి. ఫైనల్ గా మాస్ మహారాజ్ రవితేజ – టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటిలను ఫిక్స్ చేశారని ఇదివరకే తెలిపాము.
ఆ తర్వాత డైరెక్టర్ ఎవరూ అనే దానిపై పలు డిస్కషన్స్ జరిగినా అదే బ్యానర్ లో ‘రణరంగం’తో ప్లాప్ ఇచ్చిన సుధీర్ వర్మని ఫిక్స్ చేశారు. ఇక్కడితో ఫైనల్ గా ఈ సినిమాకి అల్ సెట్ అనుకుని కాస్త ఊపిరి పీల్చుకున్న నిర్మాతకి రవితేజ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. స్వతహాగా రవితేజ సోలో హీరోగా చేసే సినిమాకి 10 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ ఓ మల్టీ స్టారర్.. కావున డేట్స్ కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంది, కావున రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గిస్తారేమో అని సంప్రదింపులు జరపగా రెమ్యునరేషన్ లో ఎలాంటి తగ్గింపు లేదని రవితేజ కచ్చితంగా చెప్పేశారట. మరీ ఇంతలా డిమాండ్ చేస్తున్నారేంటి అని నిర్మాతలు బాగా నిరుత్సాహానికి గురయ్యారట.
చెప్పాలంటే రవితేజ నటించిన గత నాలుగు సినిమాలు(‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’, ‘డిస్కో రాజా’) బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. డిస్కో రాజా టైములో కూడా బడ్జెట్ ఎక్కువైందని రెమ్యునరేషన్ తగ్గించుకోమంటే ససేమిరా కుదరని చెప్పి ఫుల్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు రవితేజ. ప్రస్తుతం తను చేస్తున్న, చేయనున్న సినిమాల నిర్మాతలతో కూడా ఇదే బిహేవియర్ చూపడం నిర్మాతలని షాకింగ్ కి గురి చేస్తోంది. ఎలాంటి హీరో అయినా ప్లాప్ లో ఉన్నప్పుడు తన పారితోషికం తగ్గించుకొని కొంతవరకూ నిర్మాతలకు సపోర్ట్ గా నిలబడతాడు. కానీ రవితేజ డిమాండ్స్ మాత్రం నిర్మాతలు కరెంటు షాక్ లా ఫీలవుతున్నారు.