Advertisement

వామ్మో! ప్లాపుల్లో ఉన్నా కూడా మాస్ మహారాజాకు ఇంత రెమ్యునరేషనా?

Posted : September 15, 2020 at 3:42 pm IST by ManaTeluguMovies

మాస్ మహారాజా రవితేజ హిట్ కొట్టి చాలా కాలమైంది. అప్పుడప్పుడో రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ నుండి హిట్ అన్నదే లేదు. వరసగా ప్లాపులు వస్తున్నా, తన మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయినా, రవితేజకు మాత్రం సినిమాల పరంగా కొదవ లేదు. ఈ మాస్ హీరో చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రవితేజ పచ్చజెండా ఊపేసాడు.

యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. మారుతి-యూవీ క్రియేషన్స్ కాంబినేషన్ లో గతేడాది వచ్చిన ప్రతిరోజూ పండగే చిత్రం ఎంత పడ్డ విజయం సాధించిందో మనందరం చూసాం. కొంత బ్రేక్ తీసుకున్న తర్వాత మారుతి మరో ఎంటర్టైనింగ్ కథను యూవీ క్రియేషన్స్ కు చెప్పి ఒప్పించాడు.

ఇక ఈ ప్రాజెక్ట్ కోసం రవితేజ పారితోషికం హైలైట్ టాపిక్ అవుతోంది. దాదాపు 15 కోట్ల రూపాయలను పారితోషికం కింద అందుకోబోతున్నాడు రవితేజ. అందుకే వేరే ప్రాజెక్టులు లైన్లో ఉన్నా వాటిని పక్కనపెట్టి ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభించే అవకాశముంది. కథ మీద నమ్మకంతోనే యూవీ క్రియేషన్స్ ఈ చిత్రానికి భారీ బడ్జెట్ ను కేటాయించింది.

ప్రస్తుతం చేస్తోన్న క్రాక్ కాకుండా రవితేజ చేతిలో రమేష్ వర్మ, త్రినాథరావు నక్కిన చిత్రాలు కూడా ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

YS Bharathi Reddy | Chairperson of Sakshi Group & Wife of AP CM YSJagan | Elections TELANGANA&AP #21

Posted : May 6, 2024 at 1:57 pm IST by ManaTeluguMovies

YS Bharathi Reddy | Chairperson of Sakshi Group & Wife of AP CM YSJagan | Elections TELANGANA&AP #21

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement