Advertisement

సాయం చేయకుంటే చంపేస్తాం.. రేణు దేశాయ్‌కి బెదిరింపులు

Posted : May 28, 2021 at 11:04 am IST by ManaTeluguMovies

హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయ్యి ఆ తర్వత పవన్‌ కళ్యాణ్‌ ను వివాహం చేసుకున్న రేణు దేశాయ్‌ ఆయన నుండి విడిపోయిన తర్వాత కూడా తెలుగు వారికి సన్నిహితంగానే ఉంటూ వస్తోంది. ప్రస్తుతం ఆమె సోషల్‌ మీడియా ద్వారా కరోనా బారిన పడ్డ వారికి మరియు ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం అందిస్తూ వస్తోంది. ఆర్థికంగా తన వద్ద ఉన్నంతగా ఏదో సాయంను ఆమె అందిస్తుండగా కొందరు ఆమెపై వత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాయం చేసే ఆలోచన కూడా మానుకునేలా కొందరు చేస్తున్నారు అంటూ రేణు ఆవేదన వ్యక్తం చేసింది.

ఆక్సీజన్‌ అవసరం ఉన్న వారికి ఆక్సీజన్‌, మందులు, ఆహారం ఇతర వస్తువులను కరోనా రోగులకు మరియు వారికి సేవ చేసే వారికి రేణు దేశాయ్ అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమెను కొందరు ఆర్థికంగా సాయం చేయంటూ వేదిస్తున్నారట. సాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ కొందరు.. తమకు సాయం చేయకుంటే చంపేస్తామంటూ కొందరు ఆమెను బెదిరిస్తున్నారట. ఈ బెదిరింపులకు ఆమె సీరియస్ అయ్యింది. ఇలాంటివి మళ్లీ పునరావృతం అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించింది.


Advertisement

Recent Random Post:

Maharashtra Politics : మహాప్రచారంలో తెలుగు నేతల దూకుడు

Posted : November 17, 2024 at 9:42 pm IST by ManaTeluguMovies

Maharashtra Politics : మహాప్రచారంలో తెలుగు నేతల దూకుడు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad