Advertisement

అకీరా తెరంగేట్రంపై రేణు దేశాయ్..

Posted : June 29, 2020 at 2:26 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ భవిష్యత్ వారసుల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న వాళ్లలో అకీరా నందన్ ఒకడు. పదిహేనేళ్లకే మెగా ఫ్యామిలీలో అత్యంత పొడగరి అయిన వరుణ్ తేజ్ ఎత్తుకు దగ్గరగా వచ్చేశాడతను. మెగా ఫ్యామిలీకి కొంచెం దూరంగా పెరిగినప్పటికీ.. తండ్రి వారసత్వాన్నందుకుని అతను సినిమాల్లోకి రావడం ఖాయమనే మెగా అభిమానులు భావిస్తున్నారు.

ఈ మధ్య అతడి పుట్టిన రోజుకు సోషల్ మీడియాలో కనిపించిన హంగామా చూస్తే అప్పుడే ఈ కుర్రాడికి అంత క్రేజా అనిపించింది. పవన్ అయితే కొడుకు తెరంగేట్రం గురించి ఎప్పుడైనా మాట్లాడతాడన్న ఆశ ఎవరికీ లేదు. మరి తల్లి రేణు దేశాయ్ ఉద్దేశమేంటి? ఈ విషయంలో ఆమె ఏమనుకుంటోంది? ఓ టీవీ ఛానెల్ ఇదే విషయమై ఆమెను అడిగితే.. ఆసక్తికర సమాధానం చెప్పింది.

‘‘అకీరా వయసు ఇప్పుడు 16 ఏళ్ల మాత్రమే. అతను ఏ వృత్తిని ఎంచుకున్న నేను పూర్తిగా సపోర్ట్‌ చేస్తాను. హీరో కావడం అనేది పూర్తిగా తన ఇష్టం. వాళ్ల నాన్న, పెద్దనాన్న, అన్న హీరోలు అనే ఆలోచనతో తాను కూడా హీరో అయిపోవాలనే ప్రెజర్ తీసుకోవద్దని.. తనకు ఏదిష్టమైతే అది చెయ్యమని చెప్తాను. హీరో కావాలని అనుకుంటే అందుకు నా సపోర్ట్‌ ఉంటుంది. కుటుంబం సినీ పరిశ్రమలో ఉందని కాకుండా.. అతడి లోపలి నుంచి సినిమాల్లోకి రావాలనే నిర్ణయం రావాలి’’ అని రేణు అభిప్రాయపడింది.

ఇక సినీ పరిశ్రమలో నెపోటిజం గురించి రేణు స్పందిస్తూ.. ఇది చాలా సున్నితమైన అంశం అంది. ప్రతి చోటా బంధుప్రీతి అనేది ఉందని.. అది లేదని చెబితే మనం అబద్ధం చెప్పినట్టేనని.. సినీ పరిశ్రమ విషయానికి వస్తే వారసత్వం కెరీర్ ఆరంభంలో ఒకట్రెండు చిత్రాలకే పని చేస్తుందని.. ఆ తర్వాత సొంత టాలెంటుతోనే ఎదగాల్సి ఉంటుందని రేణు స్పష్టం చేసింది.


Advertisement

Recent Random Post:

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Campaign For NDA in Maharashtra Elections

Posted : November 15, 2024 at 7:37 pm IST by ManaTeluguMovies

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Campaign For NDA in Maharashtra Elections

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad