Advertisement

ఆర్జీవీ ‘కరోనా వైరస్’ ట్రయిలర్

Posted : May 26, 2020 at 10:52 pm IST by ManaTeluguMovies

సినిమా ఎలా వుంటుంది? వుండబోతోంది అన్న సంగతి అడక్కూడదు, తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు తప్పితే, దర్శకుడు ఆర్జీవీ తీసే సినిమాల ప్రకటనలు, ట్రయిలర్లు, లుక్ లు భలేగా వుంటాయి. వాటిని చూసి ఆయన ఉత్సాహాన్ని, ఆలోచనను, ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. కరోనా వైరస్ అలుముకున్న నేపథ్యంలో అందరూ లాక్ డౌన్ అంటూ ఇంటికే పరిమితం అయితే, ఆయన ఏకంగా సినిమానే మొదలుపెట్టేసాడు.

అది కూడా కరోనా వైరస్ నేపథ్యంలో ఓ ఫ్యామిలీ కథ. ఎప్పటి లాగే పెర్ ఫెక్ట్ గా నటులను ఎంచుకున్నారు. తనదైన టేకింగ్, తనదైన ఫ్రేమింగ్ అన్నీ మామూలే. నాలుగు నిమషాల నిడివితో కూడిన ఈ ట్రయిలర్ లో సిన్మా నేపథ్యం క్లారిటీగా చెప్పేసారు. అంతే కాదు, చూసిన ఏ కుటుంబం అయినా కరోనా అంటే కాస్త ఉలిక్కిపడేలా చేసారు.

ఆర్జీవీ దగ్గర దాదాపు గత రెండు మూడేళ్లుగా రకరకాల సినిమాలకు దర్శకుడిగా పని చేస్తున్న అగస్త్య మంజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ట్రయిలర్ లో కనిపించిన నటులు.


Advertisement

Recent Random Post:

Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విషాదం

Posted : September 19, 2024 at 10:43 pm IST by ManaTeluguMovies

Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విషాదం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad