Advertisement

ఈ రోజు ఫినిష్ చేయాల్సిదే..నిర్మాత ఆర్డర్ టు RGV

Posted : August 1, 2020 at 4:23 pm IST by ManaTeluguMovies

క్షణక్షణం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.. డీజీపీ ఆఫీసులో ఒక సీన్ ఉంది ఒరిజినల్ లొకేషన్ లో షూట్ చేద్దాం ఎలాగైనా ట్రై చేయండి అని నిర్మాత KL నారాయణ గారికి చెప్పాం..అతి కష్టం మీద ఒక హాఫ్ డే పర్మిషన్ సంపాదించాడు..మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల్లోపు ఫినిష్ చేసుకోమన్నారు..

నేను RGV కి చెప్పాను మనకి ఆ టైం సరిపోదు..ఖచ్చితంగా హాఫ్ డే అయినా పడుతుంది అని ..లేదు లేదు ఒక్క సీనేగా తీసేద్దాం అన్నాడు రాము..సరే ట్రై చేద్దాం అని రెండు గంటలకు DGP ఆఫీస్ కి వెళ్లాం..లకడీకాపూల్.. హోటల్ అశోక కి ఎదురుగా ఉంటుంది..మేం రెండింటికి వెళ్లాం కానీ DGP గారు బయటకు వెళతారు అంతవరకు బయట ఉండండి అన్నారు…ఒకే అని వైట్ చేస్తున్నాం..ఆయన 3.15 కి బయటకు వెళ్లారు..అప్పుడు మమ్మల్ని లోనికి రానిచ్చారు..

లైట్స్..కెమెరాలు అన్నీ లోపలకు వెళ్లి సెట్ చేసుకునే సరికి ఇంకో 20 నిమిషాలు..రామిరెడ్డి ఒక్కడే మెయిన్ ఆర్టిస్ట్..మిగతా వారంతా చిన్న ఆర్టిస్ట్స్..స్టడీక్యామ్ కూడా తెప్పించాం..ఇప్పుడు రామూ షాట్ ఎక్సప్లైయిన్ చేసాడు..DGP క్యారక్టర్ …ఇన్స్పెక్టర్ రామిరెడ్డికి కొన్ని సూచనలు చేసి ఈ కేస్ ఎలా డీల్ చేయొచ్చో వివరిస్తాడు..రామిరెడ్డి యెస్ సార్ అని DGP కి సెల్యూట్ చేసి అక్కడి నుండి ఇంకో టేబుల్ దగ్గర కి వెళ్లి అక్కడ ఉన్న ఒక రైటర్ లాంటి క్యారక్టర్ కొన్ని ఇంస్టర్కన్స్ ఇచ్చి అక్కడి నుండి మరో టేబుల్ వద్దకు వచ్చి అక్కడున్న టెలీఫోన్ ఆపరేటర్ తో ‘మంజీర హోటల్ కి వెళ్లే కాల్స్ వచ్చిన కాల్స్ రికార్డ్ చేసి తనకివ్వమని..తర్వాత వచ్చే కాల్స్ అన్నీ టాప్ చెయ్యమని..మరికొంచెం ముందుకు వచ్చి ఇంకో టేబుల్ దగ్గర ఇంకొన్ని సూచనలు చేసి..చివరికి బయటకు వస్తే అక్కడున్న కానిస్టేబుల్ సెల్యూట్ చేస్తే అతని వైపు చూసి తన జీప్ వైపు కదిలి జీప్ లో ఎక్కుతాడు..ఈ లోగా ఇదంతా ఫాలో అవుతున్న స్టడీ క్యామ్ కెమెరా ఆపరేటర్ కెమెరాతో సహా వచ్చి క్రేన్ ఎక్కాలి..జీప్ ముందుకి కదలగానే క్రేన్ జీప్ ని ఫాలో అవుతూ పైకి వెళ్ళాలి..ఆ జీప్ మహాసముద్రం లాంటి ట్రాఫిక్ లో కలిసిపోతే టాప్ యాంగిల్ లో కనబడాలి..ఇదీ షాట్…

అప్పుడు నేను రాముకి చెప్పాను.. ఈ షాట్ మీరు అనుకున్నట్టు తీయాలంటే రెండు రోజులు పడుతుంది అని..అదేంటి.. ఎందుకలా అన్నాడు రాము..ఇక్కడ ఆర్టిస్ట్ రామిరెడ్డి…ఆర్టిస్టుని దృష్టిలో ఉంచుకుని కూడా మనం షాట్ ప్లాన్ చేసుకోవాలి.. మీరు చెప్పునవన్నీ జరగాలంటే కనీసం ఏడూ ఎనిమిది రిహార్సల్స్ చేసి టేక్ చేయాలి..టెక్స్ కూడా కనీసం పది టేక్స్ పట్టొచ్చు ..ఎందుకంటే ఈ షాట్లో చాలా విషయాలు కూడి ఉన్నాయి..అందరూ పర్ఫెక్ట్ టైమింగ్ లో పర్ఫెక్ట్ గా చెయ్యాలి..స్టడీ క్యామ్ దీనిని ఫాలో అవ్వాలి..ఇంకో గండం ఏమిటంటే స్టడీ క్యామ్ ఆపరేటర్ స్టడీ క్యామ్ తో సహా (కనీసం ఇరవై ఐదు కిలోల బరువు) క్రేన్ ఎక్కాలి జీప్ మూమెంట్ క్రేన్ మూమెంట్ సింకర్నైజ్ అవ్వాలి.. కాబట్టి ఒక రోజు రిహార్సల్..రెండో రోజు టేక్. అలా అయితేనే సాధ్యం అని చెప్పాను..నారాయణ గారిని అడిగితే చాలా కష్టపడి ఈ పర్మిషన్ తెచ్చాను..ఇంకొరోజు అంటే సాధ్యం కాదు అని ఖరాఖండిగా చెప్పేసారు..ఏం చేద్దాం నాగేశ్వరావ్ మీరు చెప్పండి అన్నారు రాము…

ఒక ఐడియా చెబుతాను..వర్కౌట్ అవుతుందో లేదో చెప్పలేను అన్నాను..చెప్పమన్నారు రాము..’రామిరెడ్డి మనం రాసుకున్న డైలాగ్ యధాతధంగా చెప్పడం అసాధ్యం..కాబట్టి కంటెంట్ మాత్రం వివరించి తనని ఓన్ చేసుకోమని చెప్పండి..ముందు అతనికి కంటెంట్ వంటబట్టాక మిగతా అందరినీ ఎలర్ట్ చేసి ఒక రిహార్సల్ అని రామిరెడ్డి కి చెప్పి కెమెరా ఆన్ చేసి (అతనికి మాత్రం టేక్ అని తెలియకుండా) ఒకసారి ట్రై చేద్దాం’.. అన్నాను..సరే అనుకుని అందరినీ ఎలర్ట్ చేసి.. రెడీ. అని యాక్షన్ అన్నాడు రాము..అందరి మోఖాల్లో టెన్షన్..రామిరెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా డైలాగ్ చెప్పి వెళ్లి జీప్ లో కూర్చున్నాడు..thank god.. స్టడీ క్యామ్ కూడా క్రేన్ మెడకు ఎక్కింది..జీప్ ట్రాఫిక్ లో కలిసిపోయింది..క్రేన్ పైకి వెళుతుండగా.. స్టడీ క్యామ్ ఆస్పరెటర్ పైనుండి థమ్సప్ చూపాడు..కట్ అన్నాడు రాము..జీప్ తిరిగి రావటానికి 15 నిమిషాలు పట్టింది..టెక్ ఒకే అన్నాం..అతను షాక్..రాము ఈ ఐడియా ముందు ఎందుకు చెప్పలేదు అన్నాడు..ఆర్టిస్ట్ లను బట్టి పరిస్థితులను బట్టి ప్లాన్ చేసుకోవాలి.. ఇదే శ్రీదేవి అయితే ఇంత హైరానా అక్కర్లేదు..నాలుగు పేజీల డైలాగ్ కూడా సింగిల్ టెక్ లో చెప్పగలదు అన్నాను..ఫెంటాస్టిక్ అన్నారు rgv…


Advertisement

Recent Random Post:

Benz – Announcement Promo | Raghava Lawrence | Lokesh Kanakaraj | Bakkiyaraj Kannan | Sai Abhyankkar

Posted : November 5, 2024 at 8:14 pm IST by ManaTeluguMovies

Benz – Announcement Promo | Raghava Lawrence | Lokesh Kanakaraj | Bakkiyaraj Kannan | Sai Abhyankkar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad