వివాదాలతో సావాసం చేయడం రామ్ గోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఎప్పుడూ ఏదో విషయంలో వర్మ వివాదాలను తన భుజాన వేసుకుంటాడు. తాను తీసే సినిమాలు కూడా వివాదాలకు దగ్గరగా ఉండడంతో వంటా నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. ఇక రీసెంట్ గా వర్మ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా రేప్ కేసు నేపధ్యంగా తీసుకుని సినిమా చేసాడు. దిశా పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.
ఇప్పుడు ఈ సినిమా విషయంలో భారీ వివాదమే చెలరేగింది. వర్మ ఆఫీస్ ముందు దిశా కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టిన విషయం తెల్సిందే. అలాగే దిశా కుటుంబసభ్యుల అనుమతి లేకుండా వర్మ ఈ సినిమా తీయడంతో ఆల్ ఇండియా రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ రంగంలోకి దిగింది. తక్షణమే వర్మ ఈ సినిమాను విడుదల చేయాలనుకునే ప్రయత్నాలను మానుకోవాలని రెడ్డి జెఏసీ వారించింది. అలాగే సెన్సార్ బోర్డును కూడా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయకూడదని కోరింది. దిశా మూవీ విషయంలో వర్మ ముందుకెళ్లాలని భావిస్తే తనపై భౌతికంగా దాడి చేయడానికి కూడా వెనుకాడబోమని రెడ్డి జెఏసీ స్పష్టం చేసింది.
ఇప్పటిదాకా కమ్మ, కాపు, దళితులతో సున్నం పెట్టుకున్న వర్మ ఈసారి రెడ్డి కమ్యూనిటీకి కూడా విలన్ గా మారాడు.