Advertisement

RGV చెంప చెల్లుమంది.. అయినా కానీ స్పర్శ చాలనేశాడు!

Posted : September 7, 2021 at 3:59 pm IST by ManaTeluguMovies

ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. ఆయన వివాదాలతో ప్రచారం కొట్టేయడంలో స్పెషలిస్ట్ బోల్డ్ కంటెంట్ తో ఎప్పుడూ ప్రచారం కోరుకుంటారు. ఇటీవలి కాలంలో ఏమాత్రం క్రేజు లేని కొందరు కథానాయికలకు యాంకర్లకు ఆర్జీవీ ఇస్తున్న ప్రచారం కలరింగ్ అంతా ఇంతా కాదు. బోల్డ్ అండ్ న్యూడ్ కంటెంట్ తో సదరు కథానాయికలు లేదా యాంకర్లను పాపులర్ చేసేందుకు నానా ప్రయాసలు పడుతున్నాడు.

ఔత్సాహిక కథానాయికలను టాప్ యాంగిల్ లోయాంగిల్ లో చూపించే ఫోటోషూట్లు చేయిస్తున్నాడు. కొందరితో జిమ్ చేయిస్తూ వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాల్లో ప్రచారానికి పెడుతున్నాడు. ఆర్జీవీనే నమ్ముకుని సదరు కథానాయికలు ప్రచారార్భాటానికి అనవసర హంగులకు అలవాటు పడడం ఆశ్చర్యపరుస్తోంది. ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ అంటూ ఒకటే హంగామా ఇంటర్నెట్ లో నడుస్తోంది.

ఇంతకుముందే బిగ్ బాస్ క్యూటీ అరియానా తో ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ సంచలనమైంది. ఈ వీడియోలో అరియానాతో కలిసి ఆర్జీవీ జిమ్ చేశారు. అరియానాను తాకుతూ చాలా రచ్చ చేశారు. బోల్డ్ ఎలిమెంట్స్ తో అరియానా ఇంటర్వ్యూ యూట్యూబ్ లో సంచలనంగా మారింది. ఆ తర్వాతా పలు పార్టీల్లో వేడుకల్లో కథానాయికలతో డ్యాన్సులు చేస్తూ ఆర్జీవీ చేసిన రచ్చతో సదరు నాయికలకు అంతో ఇంతో ప్రమోషనల్ గా మైలేజ్ దక్కింది.

ఇప్పుడు ఆర్జీవీ ఫోకస్ మరో బిగ్ బాస్ బ్యూటీ వైపు మళ్లింది. బోల్డ్ బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాలో ఎంతగా ప్రయత్నించినా తనకు అంతగా ఫాలోయింగ్ పెరగలేదు. కానీ ఇటీవల ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా అంతో ఇంతో వెబ్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్జీవీతో అషు బోల్డ్ ఇంటర్వ్యూ టీజర్ అంతర్జాలంలో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో కొత్త ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో అషురెడ్డి టూమచ్ అంటూ ఆర్జీవీని చెంప దెబ్బ కొట్టింది. ప్రోమోలో RGV చెంప చెళ్లుమనిపించిన తరువాత అషు రెడ్డి ఆంగ్లంలో బూతుల పంచాంగం అందుకోవడం షాక్ కి గురి చేసింది.

ఒక అమ్మాయితో నువ్వు అలా ఎలా మాట్లాడుతావు? అంటూ ఆర్జీవీపైనే శివంగిలా విరుచుకుపడింది. అషు రెడ్డి చెంప దెబ్బ కొట్టిన కూడా వర్మ కించిత్ కూడా భంగపాటుకు గురవ్వలేదు. తనదైన శైలిలో గజిబిజి వ్యవహారంతో మమ అనిపించేశారు. “నేను అనుకున్నది నెరవేరింది. కనీసం నీ చేతి స్పర్శ నాకు నా చెంపను తాకింది“ అంటూ అషు కి ఊహించని షాకిచ్చాడు ఆర్జీవీ. ఓ మై గాడ్! అంటూ అషురెడ్డి దానికి ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఇక ఈ వీడియోలో అషురెడ్డిని లోయాంగిల్ నుంచి హైలైట్ చేసేందుకు ఆర్జీవీ నియమించిన కెమెరా ఎంతగానో తహతహలాడింది. అన్నట్టు ఈ లోయాంగిల్స్ తో అషురెడ్డికి ఏమేరకు ప్రమోషన్ దక్కుతుందో.. ఆర్జీవీని చెంప దెబ్బ కొట్టినంత మాత్రాన తనను పిలిచి పెద్ద తెర అవకాశాలిచ్చేదెవరో ..! కాస్త ఆగితే కానీ తేలదు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.


Advertisement

Recent Random Post:

డిక్లరేషన్ వివాదం పై పోసాని ఘాటు వ్యాఖ్యలు.. | Posani Krishna Murali | Tirumala | Chandrababu

Posted : September 28, 2024 at 5:58 pm IST by ManaTeluguMovies

డిక్లరేషన్ వివాదం పై పోసాని ఘాటు వ్యాఖ్యలు.. | Posani Krishna Murali | Tirumala | Chandrababu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad