Advertisement

‘ఆశ..ఎన్ కౌంటర్’ పై ఆర్జీవి సంచలన వ్యాఖ్యలు

Posted : December 31, 2021 at 11:27 am IST by ManaTeluguMovies

సంచలన దర్శకుడిగా పేరున్న ఆర్జీవి నిత్యం సోషల్ మీడియాలో తనదైన శైలిలో కనిపిస్తూ ఉంటాడు. వాస్తవిక కథలను ఆధారంగా సినిమాలు తీసే ఈయన ఆధ్వర్యంలో మరో సినిమా రాబోతుంది. గతంలో హైదారాబాద్ సరిహద్దుల్లో జరిగిన ‘దిశ’ సంఘటన ఆధారంగా దీనిని తీసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఆర్జీవీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తీసేముందు ఎంతో మంది పోలీసులను తాను కలిశానని చెబుతున్నారు. అయితే వాస్తవంగా అత్యాచార ఘటనలు ఎందుకు అవుతున్నాయి..? దానికి కారకులు ఎవరు..? అనే విషయాలపై హాట్ కామెంట్స్ చేశారు.

సమాజంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే ఆర్జీవి.. హైదరాబాద్లో జరిగిన ‘దిశ’ ఎన్ కౌంటర్ ను బేస్ చేసుకొని ‘ఆశ.. ఎన్ కౌంటర్’ అనే సినిమాను తీశారు. అయితే సినిమా ప్రారంభంలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్ కౌంటర్ బాధితుల పక్షాన సినిమా తీస్తున్నారని కొందరు ఆరోపించారు. కానీ అలాంటిదేమీ ఉండదని ఆర్జీవి క్లారిటీ ఇచ్చారు. అయితే వాస్తవానికి ఈ సినిమా దర్శకుడు ఆనంద్ చంద్ర. కానీ రామ్ గోపాల్ వర్మ దగ్గరుండీ అన్నీ చూసుకున్నారు. జనవరి 1న దీనిని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు.

‘ఆశ..ఎన్ కౌంటర్’ సినిమా ‘దిశ’ సంఘటన ఆధారంగా మాత్రమే కాదు.. దేశంలో జరిగిన ఎన్నో అత్యాచారాలు జరిగిన సంఘటనలను బేస్ చేసుకున్నాం. ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ కూడా ఇందులో చూపించాం. ప్రత్యేకంగా ఒక అమ్మాయి మీద ఎందుకు ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయనేది చూపించాం. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నిటిలో ఓ కామన్ పాయింట్ ఉంటుంది. ఒంటరిగా అమ్మాయి కనిపించగానే కొందరు యువకులు రాక్షసుల్లా మారుతూ వారిపై దాడులకు దిగుతున్నారు. ’

‘అయితే అత్యాచారం చేయకముందు అందరూ మనుషులే. మారి వారిని చూడగానే అలా ఎందుకు మారుతున్నారు..? అనేది కాన్సెప్ట్. అయితే ఒక అత్యాచారం సంఘటన జరిగితే.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోకుండా.. వెంటనే ఎన్ కౌంటర్ చేయడం కరెక్టేనా..? అంతటితో పోలీస్ స్టేట్ మెంట్ అయిపోతుందా..? అనేది సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం. అయితే ఈ విషయంలో చాలా పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసుల దగ్గర నుంచి సమాచారం సేకరించాం. ఆ తరువాతే సినిమా తీశాం’

‘ఒక దర్శకుడు పరిధిని నిర్ణయించుకున్న తరువాత అందులోనే సినిమా తీస్తాడు. ఈ సినిమాలో కూడా దర్శకుడు పరిధి దాటలేదు.. అలాంటప్పుడు ఆ సినిమాకు నేను డైరెక్టర్ గా ఉన్నా.. ఇతర వాళ్లు ఉన్నా ఒక్కటే. సినిమాలో అత్యాచారం ఎపిసోడ్ 45 నిమిషాల పాటు ఉంటుంది. ఆ తరువాత నిందితులను ఎన్ కౌంటర్ చేయడం వంటి విషయాలపై సాగుతుంది. ఈ సినిమాను తీసిన డైరెక్టర్ ఆనంద్ చంద్ర మంచి ప్రతిభ ఉన్నవారు’ అని రాజమౌళి అన్నారు.


Advertisement

Recent Random Post:

Rangareddy : రిచ్‌మండ్ విల్లాస్‌లో రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ

Posted : September 17, 2024 at 1:49 pm IST by ManaTeluguMovies

Rangareddy : రిచ్‌మండ్ విల్లాస్‌లో రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad