వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో సినిమాలపై దృష్టి పెట్టకుండా ఇష్టానుసారంగా సినిమాలు తీస్తున్నారు. కానీ ఒకప్పుడు అయినా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించడంలో సందేహం లేదు. ట్రెండ్ సెట్టర్ సినిమాలను తెరకెక్కించిన ఆయన అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ కి లైఫ్ ఇచ్చాడు అందులో సందేహం లేదు. అలాంటి రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం రాధేశ్యామ్ పై మరియు చిన్న బడ్జెట్ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ గురించి చర్చించారు.
రెండు సినిమాల్లో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా అట్టర్ ఫ్లాప్ కాగా ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రాధేశ్యామ్ సినిమా కు అంత బడ్జెట్ పెట్టి తీయడం పై వర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కథలోని ఎమోషన్స్ ను చూపించడానికి విజువల్ వండర్ గా చూపించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కథ ను సింపుల్ గా చూపించిన కూడా కంటెంట్ బాగుంటే తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ది కశ్మీర్ ఫైల్స్ సినిమా నిరూపించింది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ప్రతి సినిమా విషయం లో నెగటివ్ గానే మాట్లాడుతూ ఉన్నారు.. కానీ ఈసారి మాత్రం చాలా సాఫ్ట్ గా మాట్లాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాధేశ్యామ్ సినిమా విషయం లో ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే అంటూ స్వయంగా ప్రభాస్ అభిమానులు కూడా ఒప్పుకున్నారు.