Advertisement

వర్మ ‘డేంజరస్’..పాల్ మాటల్లో మీనింగ్ ఫుల్ మూవీ!

Posted : April 4, 2022 at 1:07 pm IST by ManaTeluguMovies

పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` గురించి అంతా ఎంతో గొప్పగా చెబుతుంటే ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఏ పాల్ ఎలా విరుచుకుపడ్డారో తెలిసిందే. సంచలన దర్శకుడు రాంగోల్ వర్మ సైతం `ఆర్ ఆర్ ఆర్` ని ఆకాశానికి ఎత్తేసారు. కానీ పాల్ మాత్రం `ఆర్ ఆర్ ఆర్` పై తీవ్ర స్థాయిలో విరచుకుపడుతూ ఓ వీడియోపోస్ట్ చేసారు. ఎఫ్ బీ లైవ్ లో ఓ నెటి జనుడు పాల్ ని `ఆర్ ఆర్ ఆర్` గురించి ప్రశ్నించగా ..

‘అదెక్కడి మూవీ అయ్యా బాబూ.. రోజుకో మూవీ వస్తున్నట్లుంది. మీకు ఇక పనిపాట్లూ ఏమీ లేవా? రోజూ మూవీస్ చూడడమేనా? టైమ్ వేస్ట్ చేయడమేనా? ఎవరో మూవీ చేస్తారు.. మీరు వాటిని చూస్తారు.. టైమ్ వేస్ట్ తప్ప.. దానివల్ల వచ్చే లాభం ఏమిటి? ఏవైనా మీనింగ్ఫుల్ మూవీస్ ఉంటే చూడాలి.

ఈ మూవీ గురించి నేను వినలేదు.. నాకు తెలియదు. వారానికి రెండు.. మూడు సినిమాలు చేస్తున్నారంటూ తెలుగులో.. నిజమేనా? అది..” అని చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలు విన్న రాంగోపాల్ వర్మ’నీ మొహం రా’.. అంటూ ఘాటుగా ట్విట్టర్లో కామెంట్ చేశారు.

దీనికి నెటి జనులు కూడా తమదైన శైలిలో వంతు పాడారు. తాజాగా పాల్ వీడియోని..అందులో పాల్ మాట్లాడిన మాటల్ని ఛేంజ్ చేసి వర్మ తెలివిగా తన సినిమా ప్రచారం కోసం ఎలా వాడుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వాయిస్ ఛేంజ్ వీడియోని వర్మ ట్విటర్లో పోస్ట్ చేసి తన సినిమాకి కావాల్సినంత ప్రచారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం వర్మ `డేంజెరస్` అనే మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈనెలలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది. దీంతో కె.ఏపాల్ మాటల్ని వేరే వాయిస్ కి సింక్ చేసి అందరూ కచ్చితంగా డేంజరస్ సినిమాని మొదటి రోజే చూడాలని చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఎవరెవరో ఏదేదో సినిమా తీస్తే మొదటి రోజే చూస్తారు. ఏదైనా మీనింగ్ ఫుల్ మూవీ చూడటంలో తప్పు లేదు.

నా దృష్టిలో మీనింగ్ ఫుల్ మూవీ `డేంజరస్` మూవీ అని పాల్ ఎక్స్ ప్రెషన్ తో మరో వాయిస్ సింక్ చేయించి చెప్పించారు వర్మ. చూసారా వర్మ ఎంత ఘనుడో. మరి ఈ వీడియోపై పాల్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి. ఇలాంటి కామెడీలు చేయడం..అందులోనూ పాల్ పై చేయడం వర్మకి కొత్తేం కాదు. వాటిపై పాల్ కూడా అందే సీరియస్ గా రియాక్ట్ అవుతారు.


Advertisement

Recent Random Post:

Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

Posted : September 23, 2024 at 12:03 pm IST by ManaTeluguMovies

Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad