Advertisement

వర్మ వింత కోరికకు షాకైన యాంకర్!!

Posted : June 26, 2020 at 2:08 pm IST by ManaTeluguMovies

రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాల పుట్ట. ఆయన ఏం చేసినా అందులో ఒక వివాదముంటుంది, లేదా వివాదముండాలనే ఆయన ఏదైనా పనిచేస్తాడేమో. ఒకప్పుడు అందరూ గర్వించేలా సినిమాలు చేసిన వర్మ ఇప్పుడు నాసిరకం స్థాయికి పడిపోయాడు. ఇప్పుడనే కాదు కొన్నేళ్ల నుండి రామ్ గోపాల్ వర్మ నుండి గుర్తించుకోదగ్గ సినిమా రాలేదు. అయినా కానీ రామ్ గోపాల్ వర్మ తన సినిమాలకు పబ్లిసిటీ తీసుకురావడంలో విజయవంతమవుతూనే ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నాసిరకంలోనే అథమ స్థాయి సినిమాలు తీస్తున్నాడు. క్లైమాక్స్ చూసి హార్డ్ కోర్ వర్మ ఫ్యాన్ కూడా దణ్ణం పెట్టి వెళ్లిపోయేలా ఉంది. ఇక ఇప్పుడు నగ్నం అంటూ మరో కళాఖండాన్ని దింపుతున్నాడు.

సినిమాల సంగతి పక్కనపెడితే వర్మ ఇంటర్వ్యూలకు కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, ఎవరి గురించి మాట్లాడినా జంకకపోవడం వర్మ స్టైల్. అందుకే వర్మ ఇంటర్వ్యూలకు ఇప్పటికీ గిరాకీ ఉంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వర్మను యాంకర్ మీ తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మనిషన్నాక కోరికలు సహజం. అవి తీరకపోతే బాధపడిపోతారు. అలా మీరు బాధపడిన సందర్భం ఏదైనా ఉందా అని ప్రశ్నించింది.

దానికి వర్మ తనదైన శైలిలో నాకు ఏదైనా కోరిక కలిగితే అది వెంటనే తీర్చేసుకుంటాను. తీరని కోరిక అంటూ ఉండదు. అది తీరదని తెలిస్తే అసలు కోరుకోను. నాకు మిమ్మల్ని బికినిలో చూడాలని కోరికగా ఉంది. మీకు ఓకే అంటే వెంటనే ఆఫర్ ఇస్తా అని అన్నాడు. వర్మ కోరిక విని షాకవ్వడం యాంకర్ వంతైంది.


Advertisement

Recent Random Post:

Ramnagar Bunny Movie Teaser II Chandrahass II Vismaya Sri II Richa Joshi II Ambika II Rithu Manthra

Posted : September 16, 2024 at 3:12 pm IST by ManaTeluguMovies

Ramnagar Bunny Movie Teaser II Chandrahass II Vismaya Sri II Richa Joshi II Ambika II Rithu Manthra

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad