స్వర్గస్తులైన నేపథ్యంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెస్ట్ ఇన్ పీస్(రిప్) అంటూ టైప్ పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియా వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ పదం ప్రతీ చోటా చాలా కామన్ గా మారిపోయింది. సంతాపం ప్రకటించే సందర్భంలో రిప్ అంటూ పోస్ట్ పెడుతుంటారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి స్వర్గుస్తులైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిప్ అంటూ పోస్టులు పెట్టారు. అయితే రేణు దేశాయ్ రిప్ కి సంబంధించి నెటి జన్లకు ఓ సూచన ఇచ్చారు. `నా తల్లి మరణించిన తర్వాత నా స్నేహితులు, నెటి జనులు అంతా రిప్ అని సంతాపం ప్రకటించారు.
కానీ అది చాలా తప్పు అని, అలా రిప్ అని పెట్టకూడదంటూ సలహాలు ఇచ్చింది. హిందువులు చనిపోతే రిప్ అని చెప్పకండి.. రిప్ అంటే.. ఆత్మకు విశ్రాంతి దొరకడం అని, కానీ హిందు ధర్మం ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు.. దానికి విశ్రాంతి ఉండదు.. పుట్టడం, గిట్టడం అనేది నిరంతరం జరిగే ఓ సర్కిల్ అని చెప్పుకొచ్చింది.
అందుకే రెస్ట్ ఇన్ పీస్ అని, రిప్ అని వాడొద్దు అంటూ సలహాలు ఇచ్చింది. దానికి బదులు ఓం శాంతి, సద్గతి అని చెబితే బాగుంటుందని సూచించింది. సనాతన ధర్మం కూడా అదే చెబుతోందని రేణూ దేశాయ్ పేర్కొంది. ఈ విషయాన్ని తాను కొన్ని రకాల ఆచారాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడే ఒక పండిట్ నుండి రిప్..సద్గతి మధ్య తేడా తెలుసుకున్నానన్నారు.
ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకోవాలనే ఇలా స్పందించాను. అంతకు మించి ఎవరి నమ్మకాలను సవాల్ చేయడం తన ఉద్దేశం కాదన్నారు. అయితే రేణు చేసిన ఈ పోస్ట్ పై కూడా కొందరు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. దీంతో రేణు దేశాయ్ కామెంట్ సెక్షన్ తాత్కాలికంగా నిలిపి వేసింది.