Advertisement

RRR విలన్ మృతి.. తారక్ ఏమోషనల్

Posted : May 23, 2023 at 8:06 pm IST by ManaTeluguMovies

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి ప్రభంజనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే “రణం రౌద్రం రుధిరం” సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించిన ప్రముఖ నటుడు రే స్టీవెన్ సన్ ఎం అద్భుతంగా నటించారో కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఊహించని రీతిలో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

రే స్టీవెన్ సన్ హఠాన్మరణంపై ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తీవ్ర విషాధం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ ట్వీట్ చేస్తూ.. తమ మనసులోని భావాన్ని వెల్లడించింది. రే స్టీవెన్ సన్ 56 ఏళ్ల వయసులో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా నటించారని చెప్పారు. అలాగే ఓ స్టంట్ చేసి అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసినట్లు వెల్లడించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ నుంచి ఓ పొటోను మేకర్స్ షేర్ చేశారు.

ఆయన సెట్స్ లో ఉన్న ప్రతీ క్షణం చాలా ఆనందంగా గడిపామని.. కానీ ఆయన తమని చాలా త్వరగా వదిలి వెళ్లిపోయారని మూవీ టీం ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ తో రే డెడికేషన్ కు సినీ లవర్స్ అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కేవలం చిత్రబృందం మాత్రమే కాకుండా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా రే స్టీవెన్ సన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ వేధికగా… రే స్టీవెన్ సన్ మరణ వార్త విని షాక్ అయ్యానని చెప్పారు. చాలా త్వరగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారని కామెంట్ చేశారు. ఆయనతో పని చేయడం గొప్ప అనుభవం అన్నారు. అతని ఆత్మకు శాంతి కల్గాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కష్ట సమయంలో తమ ఆలోచనలు ప్రార్థనలు.. ఆయన కుటుంబ సభ్యుల్లో ధైర్యాన్ని కల్గించాలని భావిస్తున్నట్లు తెలిపారు. యంగ్ టైగర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

1964 మే 25వ తేదీన నార్త్ ఐర్లాండ్ లోని లిస్ బర్న్ లో జన్మించిన స్టీవెన్సన్.. హాలీవుడ్ లోని ప్రముఖ థోర్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 1990లో టీవీ రంగంలో అడుగు పెట్టి పపలు షోల్లో నటించారు. ఆ తర్వాత హాలీవుడ్ చిత్రాలు 1998లో థియరీ ఫ్ ఫ్లైట్ అనే చిత్రంలో తొలిసారిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. 1997లో రూత్ గెమ్మెల్ అనే హాలీవుడ్ నటిని రే స్టీవెన్ సన్ వివాహం చేసుకోగా.. 2005లో విడిపోయారు. ఆ తర్వాత ఆంత్రోపాలజిస్ట్ ఎలిసబెట్టా కరాకియాతో డేటింగ్ చేయగా.. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.


Advertisement

Recent Random Post:

ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన NTR | Jr NTR Pays Tributes to NT Ramarao

Posted : May 28, 2023 at 8:19 pm IST by ManaTeluguMovies

Watch ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన NTR | Jr NTR Pays Tributes to NT Ramarao

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement