Advertisement

ఆర్ ఆర్ ఆర్: రామరాజు ఫర్ భీమ్ వచ్చేది అప్పుడే!

Posted : October 6, 2020 at 8:26 pm IST by ManaTeluguMovies

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిన్నటి నుండి తిరిగి ప్రారంభమైన విషయం తెల్సిందే. అలాగే కొమరం భీమ్ స్పెషల్ వీడియో అప్డేట్ కూడా ఇచ్చారు. ఇందుకోసం ఒక వీడియోను విడుదల చేసారు. ఆ వీడియోలో షూట్ కు ముందు బ్యాక్ ఎండ్ వర్క్స్ ను చూపించారు. సెట్స్ ను తిరిగి నిర్మించడం. ఆయుధాలు, కాస్ట్యూమ్స్ మళ్ళీ సిద్ధం చేయడం వంటివి ఈ వీడియోలో పొందుపరిచారు.

ఇక వీడియో ఆఖర్లో అసలైన మ్యాటర్ ఉంది. రాజమౌళి హీరోస్ రెడీ అనగానే ఒకరు గుర్రంపై, మరొకరు బులెట్ పై వస్తోన్న వీడియోను బ్లర్ చేసి చూపించడం అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ను ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక అక్టోబర్ 22న దసరా సందర్భంగా కొమరం భీమ్ వీడియోను విడుదల చేయనున్నారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ విజువల్స్ ను చూపించనున్నారు. మరి ఈ వీడియో ఎంతటి సంచలనం అవుతుందో చూడాలి.

ఇక ఆర్ ఆర్ ఆర్ షూట్ మరో రెండు నెలలు హైదరాబాద్ లోనే జరగనుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా షూట్ లో పాల్గొంటున్నట్లు తాజా వీడియో ద్వారా అర్ధమైంది.


Advertisement

Recent Random Post:

Sathyam Sundaram – Pre Release Event LIVE | Karthi | Arvind Swami | Govind Vasantha | C. Premkumar

Posted : September 23, 2024 at 9:07 pm IST by ManaTeluguMovies

Sathyam Sundaram – Pre Release Event LIVE | Karthi | Arvind Swami | Govind Vasantha | C. Premkumar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad