Advertisement

డే-1లో నంబర్ -1 గ్రాసర్ RRR ని బ్రేక్ చేసేదెవరు?

Posted : April 17, 2022 at 12:57 pm IST by ManaTeluguMovies

ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోని టాప్ 10 అత్యధిక ఓపెనింగ్ డే గ్రాసర్ లుగా నిలిచిన సినిమాలేవీ? అంటే..! యష్ నటించిన KGF 2 బాక్సాఫీస్ వద్ద గోల్ ని సాధించింది కానీ SS రాజమౌళి క్రేజీ చిత్రం RRR బాక్సాఫీస్ వద్ద అజేయంగా నిలిచి ఉందన్న విశ్లేషణ సాగుతోంది. IMDb పోస్ట్ చేసిన భారతదేశపు టాప్ 10 అత్యధిక ఓపెనింగ్ డే గ్రాసర్ లను పరిశీలిస్తే…

RRR చిత్రం డే వన్ టాప్ గ్రాసర్ జాబితాలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కథానాయకులుగా SS రాజమౌళి తెరకెక్కించిన RRR మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 222.5 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఇప్పటికీ `బాహుబలి: ది కన్క్లూజన్` రికార్డ్ అలానే ఉంది. ఎస్.ఎస్ రాజమౌళి బాక్సాఫీస్ వద్ద తనకు తానే పోటీ అని నిరూపించారు. ప్రభాస్- రానా దగ్గుబాటి- అనుష్క శెట్టి- తమన్నా భాటియా తదితరులు నటించిన `బాహుబలి: ది కన్ క్లూజన్` మొదటి రోజున రూ. 213 కోట్లు వసూలు చేసింది.

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్-ప్యాక్డ్ ఫ్రాంచైజీ KGF చాప్టర్ 2 మొదటి రోజున రూ. 165.1 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద టాప్ 3 గ్రాసర్ గా నిలిచింది.

ప్రభాస్ – శ్రద్ధా కపూర్ నాయకానాయికలుగా సుజీత్ తెరకెక్కించిన పాన్-ఇండియా చిత్రం సాహో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై నా కానీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రారంభ రోజున రూ. 124.6 కోట్లు వసూలు చేసింది. రజనీకాంత్ – అక్షయ్ కుమార్ నటించిన 2.0 ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లో మొదటి రోజు 105.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ డ్రామా కబాలి కూడా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 90 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం బీస్ట్ KGF2 క్లాష్ తో ప్రభావితమై నా కానీ.. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 87.1 కోట్లు వసూలు చేయగలిగింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా `సైరా నరసింహా రెడ్డి` కూడా 85.3 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రారంభంతో ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ `థగ్స్ ఆఫ్ హిందుస్థాన్` ప్రేక్షకులను వారి సీట్లకు కట్టిపడేయడంలో విఫలమై నా కానీ ప్రీ-రిలీజ్ హైప్ తో మొదటి రోజున రూ. 76.2 కోట్లు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చలనచిత్రాల టాప్ 10 జాబితాలో చివరిది అనుకోవచ్చు.. కానీ మరోసారి SS రాజమౌళి సంచలనం `బాహుబలి: ది బిగినింగ్` ప్రారంభ రోజున రూ. 73 కోట్లు వసూలు చేసింది. అలాంటి వేవ్ మళ్లీ వస్తుందా అనుకున్నారు అప్పట్లో. హిందీ పరిశ్రమకు పాఠాలు నేర్పించినవన్నీ సౌత్ సినిమాలేనని ఈ జాబితా చెబుతోంది.

డే-1లో నంబర్ -1 గ్రాసర్ RRR ని బ్రేక్ చేసేదెవరు? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. మళ్లీ రాజమౌళి తెరకెక్కించిన సినిమానే రావాలేమో అంటూ హిందీ మీడియా విశ్లేషించడం హాట్ టాపిక్ గా మారింది. తదుపరి మహేష్ – రాజమౌళి సినిమాకే ఆ అవకాశం ఉందా? లేదూ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ సలార్ కి ఆ ఛాన్స్ ఉంటుందా? అన్నది వేచి చూడాలి.


Advertisement

Recent Random Post:

Ram Charan Participates in Mushaira At Kadapa Dargah

Posted : November 18, 2024 at 10:26 pm IST by ManaTeluguMovies

Ram Charan Participates in Mushaira At Kadapa Dargah

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad