బాహుబలి ప్రభాస్ తో యువి క్రియేషన్స్ అందించిన సినిమా సాహో. విపరీతమైన అంచనాల మధ్య విడుదలయింది. అయితే ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమయింది. అలా విపలమైనా కూడా మంచి ఫలితాలు నమోదు చేసింది. అది కూడా ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా. ఇదంతా ప్రభాస్ కు బాహుబలితో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ఇచ్చిన కిక్.
అయితే ఈ సినిమా విడుదల అంతా హడావుడి హడావుడిగా జరిగింది. డేట్ కమిట్ మెంట్ ను మీట్ కావడం కోసం హడావుడిగా విడుదల చేసారు. ఈ సమయంలో సినిమా తెలుగు శాటిలైట్ డీల్ కూడా కాకుండానే విడుదల చేసేసారు. ఆ తరువాత ఈ డీల్ అలా అలా ఆలస్యం అవుతూ వచ్చింది.
యువి సన్నిహిత వర్గాల భోగట్టా ప్రకారం రెండు వారాల క్రితమే సాహో శాటిలైట్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మరికొన్ని రీజనల్ లాంగ్వేజెస్ కలిసి 20 కోట్ల దగ్గరలో డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. కేవలం తెలుగు శాటిైలైట్ నే 12 కోట్లకు రేట్ కట్టినట్లు తెలుస్తోంది. సాహో సినిమా కారణంగా ఆర్థికంగా కాస్త నష్టపోయిన యువి సంస్థ ఈ డీల్ లో చాలా వరకు నష్టం పూడ్చుకునే అవకాశం వుంది.