Advertisement

మా అమ్మకు నాకు గొడవలు – సాయితేజ్

Posted : May 27, 2020 at 9:37 pm IST by ManaTeluguMovies

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లో అమ్మకు బాగా దొరికిపోయానంటున్నాడు హీరో సాయితేజ్. తన పెళ్లి విషయంలో అమ్మకు, తనకు ప్రతి రోజూ ఏదో ఒక గొడవ జరుగుతోందని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పట్లో పెళ్లి మాత్రం చేసుకోనంటున్నాడు ఈ హీరో.

“మా అమ్మకు నాకు సగం గొడవలు నా పెళ్లి గురించే. మరో రెండేళ్ల టైమ్ కావాలంటూ మొన్ననే మెల్లగా మా అమ్మను ఒప్పించాను. రెండేళ్ల వరకు ఎందుకు పెళ్లి వద్దంటూ ప్రస్తుతం ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. చర్చల తర్వాత నాకు రెండేళ్లు టైమ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది.”

జీవితంలో ఇప్పటివరకు తన మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదంటున్నాడు సాయితేజ్. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరికినా తనను అర్థం చేసుకోవడానికి చాలా టైమ్ తీసుకుంటానని, అందుకే పెళ్లికి రెండేళ్లు గ్యాప్ అడిగానంటున్నాడు.

“సినిమాలకు, పర్సనల్ లైఫ్ కు సంబంధం లేదు. కరెక్ట్ అమ్మాయి దొరకలేదు. ఆమె దొరకాలి, నాకు నచ్చాలి. పైగా ఇలాంటి విషయాల్లో నేను చాలా టైమ్ తీసుకుంటాను. అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ఆమాత్రం టైమ్ కావాలి.”

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లో పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపిన సాయితేజ్.. లాక్ డౌన్ కారణంగా తన సినిమా వాయిదా పడిందనే బాధ కంటే తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమౌతున్న ఉప్పెన సినిమా వాయిదా పడినందుకు ఎక్కువ బాధేసిందంటున్నాడు. త్వరలోనే సోలో బ్రతుకు సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు సాయితేజ్.


Advertisement

Recent Random Post:

Mahavatar Narsimha Motion Poster Video | Hombale Films | Kleem Productions | Ashwin Kumar

Posted : November 16, 2024 at 10:00 pm IST by ManaTeluguMovies

Mahavatar Narsimha Motion Poster Video | Hombale Films | Kleem Productions | Ashwin Kumar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad