Advertisement

మెగా హీరో పెళ్లి ఇప్పట్లో కాదట.. ఇంకా చాలా సమయం ఉందట

Posted : December 15, 2020 at 7:17 pm IST by ManaTeluguMovies

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ పెళ్లికి సిద్దం అవుతున్నాడు అంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకానొక సమయంలో ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందనే ప్రచారం జరిగింది. కుటుంబ సభ్యులు ముఖ్యంగా చిరంజీవి తేజూ పెళ్లి విషయంలో సీరియస్‌ గా ఉన్నాడని త్వరలోనే తేజూకు పెళ్లి చేసేయాలనే నిర్ణయానికి కుటుంబం మొత్తం వచ్చిందని ప్రచారం జరిగింది. ఆమద్య తేజూ కూడా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులు బాగా ఒత్తిడి చేస్తున్నారు అంటూ ఫన్నీగా వ్యాఖ్యలు చేశాడు.

ఆయన నటించిన సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తేజూ మాట్లాడుతూ తాను పెళ్లి కి సిద్దంగా లేను అని, ఇంకా నాలుగు అయిదు సంవత్సరాల వరకు పెళ్లి ముచ్చట తీసుకు రాను అన్నాడు. పెళ్లి కంటే ముందు కెరీర్ లో సక్సెస్‌ అవ్వాలి అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పెళ్లి వయసు ఇంకా రాలేదని తాను భావిస్తున్నట్లుగా తేజ్‌ పేర్కొన్నాడు. సమయం అడిగాను అని కుటుంబ సభ్యులు ఓకే అంటారని ఆశిస్తున్నాను అన్నాడు.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 5th November” 2024

Posted : November 5, 2024 at 10:03 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 5th November” 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad