సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును విచారణ జరుపుతున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరులు మీడియాతో మాట్లాడాడు. ఎల్బీ నగర్ కు చెందిన అనీల్ అనే వ్యక్తి నుండి సాయి ధరమ్ తేజ్ ట్రంప్ బైక్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా అనీల్ పేరు మీదే ఆ బైక్ ఉంది. ట్రంప్ బైక్ పై హై స్పీడ్ చలానా లు గతంలో ఉన్నాయి. యాక్సిడెంట్ సమయంలో ఆయన స్పీడ్ 75 కిమీ ఉన్నట్లుగా పేర్కొన్నాడు.
రూల్ ప్రకారం ఆ రోడ్డు మీద 30 కిమీ వేగంతో వెళ్లాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జీ మీద ఆయన 100 కిలో మీటర్ల వేగంతో కూడా ప్రయాణించినట్లుగా పేర్కొన్నాడు. మొత్తానికి అతి వేగంతోనే సాయి ధరమ్ తేజ్ ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ లో కూడా 75 వేగం అంటే మామూలు విషయం కాదు. ఆ ట్రాఫిక్ మరియు రోడ్డు తీరకు సాయి ధరమ్ తేజ్ 40 నుండి 50 స్పీడ్ తో వెళ్లి ఉంటే యాక్సిడెంట్ అయ్యేది కాదు అనేది పోలీసుల వాదన.