చూస్తుంటే 2020 టాలీవుడ్ కు పెళ్లిళ్ల సీజన్ లా ఉంది. వరసగా టాలీవుడ్ లోని బ్యాచిలర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరుగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీసెంట్ గా నిఖిల్, నితిన్, రానా దగ్గుబాటి తమ తమ గర్ల్ ఫ్రెండ్స్ ను వివాహమాడిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో హీరో చేరబోతున్నాడు. యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడని తెలుస్తోంది. అయితే తన స్నేహితులలా కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకోనున్నాడు తేజ్.
ఆంధ్రప్రదేశ్ లోని వారి చుట్టాల ద్వారా సాయి ధరమ్ తేజ్ కుటుంబానికి ఈ సంబంధం వచ్చింది. వచ్చిన వెంటనే ఇద్దరికీ జోడి బాగుందని భావించారు. సాయి ధరమ్ తేజ్ తల్లి తన సోదరుడు చిరంజీవికి కూడా ఈ సంబంధం చూపించగా తనకు కూడా నచ్చిందని, ప్రొసీడ్ అవ్వమని చిరు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
త్వరలో ఇరు కుటుంబాల మధ్య మాటలు కూడా ఉంటాయని సమాచారం. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకు సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. త్వరలోనే విడుదల ఉండే అవకాశం ఉంది