దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నెలకు పైగా రైతుల ఆందోళన కొనసాగుతుంది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న రైతుల ఆందోళనకు విదేశీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో కొందరు మన దేశ ప్రముఖులు స్పందించారు. ఇది మా దేశపు అంతర్గత విషయం. దీనిలో మీ జోక్యం అవసరం లేదు అంటూ సచిన్, కోహ్లీ బాలీవుడ్ ప్రముఖులు కొందరు కూడా సోషల్ మీడియా ద్వారా ఘాటుగా హెచ్చరించారు. ఈ విషయమై సల్మాన్ ఖాన్ కూడా తనదైన శైలిలో స్పందించాడు.
తాజాగా ఒక మీడియా సమావేశంలో రైతుల ఆందోళన గురించి మాట్లాడమంటూ ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. సరైనది తప్పనిసరిగా జరగాలి… చాలా సరైన పని చేయాలి… అందరికి అవసరం అయినది జరగాలంటూ చెప్పుకొచ్చాడు. ఆయన వ్యాఖ్యలతో మీడియా వారు నోరు వెళ్లబెట్టారు. ఏం చెప్పాడో క్లీయర్ గా అర్థం అయ్యేప్పటికి సల్మాన్ ఖాన్ అక్కడ నుండి వెళ్లి పోయాడు. రైతుల ఆందోళన విషయంలో బాలీవుడ్ స్టార్స్ ఆచితూచి మాట్లాడుతున్నారు. కేంద్రంతో పోరాటం ఎందుకు అనుకున్న కొందరు వారికి మద్దతు తెలపాలని ఉన్నా కూడా పొడి పొడిగా స్పందిస్తున్నారు. మరి సల్మాన్ స్పందన కు అర్థం ఏంటో ఆయనే చెప్పాలి.