Advertisement

ఎక్స్ క్లూజివ్: పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో సమంత.?

Posted : October 10, 2020 at 10:23 pm IST by ManaTeluguMovies

పురాణాలు, ప్రేమకథ, యాక్షన్, సెంటిమెంట్ సినిమాలు తీయడంలో దిట్ట అనిపించుకున్న దర్శకుడు గుణశేఖర్ గత కొంతకాలంగా ‘హిరణ్యకశ్యప’ సినిమాపై వర్క్ చేశారు. ఆ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉండడం వలన మరో పురాణం ప్రేమకథని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్దమయ్యాడు. అదే ‘శాకుంతలం’. మహాభారతంలోని విశ్వామిత్ర కుమార్తె శకుంతల దేవి ప్రేమకథని ఇందులో చూపించనున్నారు.

ఈ సినిమాకి సంబందించిన వివరాలను మేము ఎక్స్ క్లూజివ్ గా అందజేశాము. తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో శకుంతల పాత్ర కోసం సమంత అక్కినేని తో సంప్రదింపులు జరుపుతున్నారట. అందం, అభినయం కలగలిపిన ఆ పాత్రకి సమంత అయితే న్యాయం చేయగలదని భావించి గుణశేఖర్ సమంతని అప్రోచ్ అయ్యాడట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి . అన్నీ ఓకే అయితే సమంత చేయబోయే మొట్ట మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శాకుంతలం’ అవుతుంది. మరి సమంత ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా పరిచయం అవుతూ ఈ సినిమా చేయనున్నారు. గుణశేఖర్ ఈ సినిమాని 5 భాషల్లో భారీగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు.


Advertisement

Recent Random Post:

పవన్ ప్రమాణ స్వీకారంపై నాగబాబు ఎమోషనల్ ట్వీట్

Posted : June 21, 2024 at 8:41 pm IST by ManaTeluguMovies

పవన్ ప్రమాణ స్వీకారంపై నాగబాబు ఎమోషనల్ ట్వీట్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement