తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేశారంటూ సమంత సుమన్ టీవీ.. తెలుగు పాపులర్ టీవీ మరియు డాక్టర్ సీఎల్ వెంకట్రావ్ పై పరువు నష్టం దావా వేయడం జరిగింది. కూకట్‌పల్లి కోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేశారు. సమంత తరపు న్యాయవాది తన పిటీషనర్ ఒక సెలబ్రెటీ అని.. సెలబ్రెటీ కనుక విచారణ త్వరగా చేపట్టాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సమయంలో సమంత సెలబ్రెటీ అయినా కూడా కోర్టు ముందు సామాన్యురాలే. కనుక ఆమె కేసు వంతు వచ్చిన సమయంలో విచారిస్తామని పేర్కొన్నారు.
తప్పుడు కథనాలు ప్రచురించిన వారు వెంటనే క్షమాపణలు చెప్పడంతో పాటు వారు బహిరంగంగా తమ కథనాలు నిజం కాదని చెప్పాలని సమంత పిటీషన్ లో పేర్కొన్నది. సమంత పై తప్పుడు కథనాలకు పరువు నష్ట పరహారం ఎంత వేయబోతుంది అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. ఆ విషయమై ఆమె నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కనుక త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమంత తరపు లాయర్ మీడియాకు తెలియజేయబోతున్నాడు.