Advertisement

అప్పుడు చైతూ తో.. ఇప్పుడు రౌడీ బాయ్ విజయ్‌ తో సామ్‌

Posted : March 22, 2022 at 11:21 am IST by ManaTeluguMovies

అంతా సవ్యంగా జరిగి ఉంటే నాగ చైతన్య మరియు సమంత కలిసి మరో సినిమా లో నటించే వారు. వీరిద్దరి కాంబోలో మజిలీ సినిమా కు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కాంబోలో మరో సారి సినిమా రావాల్సి ఉంది.. ఆ సినిమా కు శివ నిర్వాన దర్శకత్వం వహించేవాడు అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి.

నాగచైతన్య మరియు సమంత ల మధ్య సన్నివేశాలను ప్రేక్షకులు ఆసాంతం ఆస్వాదించారు. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా ఒక సినిమా రూపొందబోతోంది. నాగ చైతన్య తో కలిసి నటించిన సమంత ఇప్పుడు అదే దర్శకుడు దర్శకత్వం లో విజయ్ దేవరకొండ తో కలిసి నటించేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే సమంత నటించిన శాకుంతలంసినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. యశోద సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఉత్తరాదిన కూడా వరుస సినిమాలు చేస్తున్న నేపథ్యంలో విజయ్‌ దేవరకొండతో సినిమా వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.


Advertisement

Recent Random Post:

Blackout Teaser| Streaming On JioCinema Premium | 7th Jun | Vikrant Massey, Mouni Roy, Sunil Grover

Posted : May 21, 2024 at 7:26 pm IST by ManaTeluguMovies

Blackout Teaser| Streaming On JioCinema Premium | 7th Jun | Vikrant Massey, Mouni Roy, Sunil Grover

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement