Advertisement

అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ ఎట్టకేలకు కన్ఫర్మ్‌ చేశాడు

Posted : April 28, 2020 at 5:42 pm IST by ManaTeluguMovies

అర్జున్‌ రెడ్డి చిత్రంతో టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ. ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరో అయ్యాడు. అర్జున్‌ రెడ్డి సినిమాను హిందీ మరియు తమిళంలో కూడా రీమేక్‌ చేసి అక్కడ కూడా సక్సెస్‌ దక్కించుకున్నారు. హిందీలో అర్జున్‌ రెడ్డిని కబీర్‌ సింగ్‌ గా సందీప్‌ రెడ్డి రీమేక్‌ చేసి అక్కడ సెన్షేషన్‌ క్రియేట్‌ చేశాడు. ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. భారీ వసూళ్లు నమోదు అవ్వడంతో అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగకు మంచి క్రేజ్‌ ఏర్పడినది.

కబీర్‌ సింగ్‌ విడుదలైన వెంటనే ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ ఈయనతో సినిమాకు రెడీ అయిన విషయం తెల్సిందే. అయితే ఆ సినిమా ఏ హీరోతో ఉంటుంది అనే విషయంపై ఇన్ని రోజులు క్లారిటీ లేదు. సౌత్‌ హీరోతో మల్టీ లాంగ్వేజ్‌ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. కాని ఏం జరిగిందో కాని మళ్లీ బాలీవుడ్‌ హీరోకే సందీప్‌ రెడ్డి ఫిక్స్‌ అయ్యాడు. తాజాగా ఈయన ప్రాజెక్ట్‌ దాదాపుగా ఓకే అయ్యింది.

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో ఈయన మూవీ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టీ సిరీస్‌ తో పాటు అర్జున్‌ రెడ్డి నిర్మాత ప్రణయ్‌ వంగ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉండబోతున్నాడు. ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌ వరుస చిత్రాలతో దూసుకు పోతూ సక్సెస్‌ ఫుల్‌ హీరోగా ఉన్నాడు. దాంతో సందీప్‌ రెడ్డిపై భారీ చాలా ఉండబోతుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో బోల్డ్‌ కంటెంట్‌తో సందీప్‌ రెడ్డి తదుపరి చిత్రం ఉంటుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Gavireddy Ramanaidu Files Nomination As Independent

Posted : April 25, 2024 at 7:48 pm IST by ManaTeluguMovies

Gavireddy Ramanaidu Files Nomination As Independent

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement