తమిళనాట రాజకీయ సంచలనం సృష్టించిన చిన్నమ్మ శశికళ జైలు నుండి విడుదల కాబోతున్నారు. ఆర్థిక నేరం నిరూపితం అవ్వడంతో నాలుగు సంవత్సరాల జైలు జీవితంను గడిపిన ఆమె ఒకటి రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. శశికళ జైలు నుండి విడుదల కావడం కోసం 10 కోట్ల రూపాయలను కోర్టుకు చెల్లించాల్సి ఉంది. కోర్టుకు చెల్లించాల్సిన మొత్తంకు సంబంధించిన రసీదు ఇప్పటికే జైలు అధికారులకు సమర్పించారు. దాంతో ఆమె విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవు అంటున్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికల లోపు ఆమె బయటకు వస్తే రాజకీయంగా ఇబ్బంది అనే ఉద్దేశ్యంతో కొందరు ఆమెను బయటకు రాకుండా చేస్తున్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆమె విడుదలను ఎవ్వరు కూడా అడ్డుకోలేరు అంటూ ఆమె తరపు లాయర్ పేర్కొన్నారు. శశికళ విడుదల కాబోతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే కార్యకర్తలు మరియు నాయకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈమె ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి.