ఇంతటి స్టార్‌డం దక్కించుకున్న రచయిత్రి షాగుప్తా రఫీక్ గతంలో ఒక సెక్స్ వర్కర్. బార్ డాన్సర్‌గా చేయడంతో పాటు చాలా ఏళ్లు సెక్స్ వర్కర్‌గా చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాలను వెళ్లడి చేసింది.
తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాను. ఇప్పటికి కూడా నా తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ నేను పుట్టాను అనే విషయం నాకు తెలియదు. ఒక మహిళ నన్ను దత్తత తీసుకుని పెంచింది. ఆమె భర్త చనిపోవడంతో కుటుంబ భారం నాపై పడినది. 16 ఏళ్ల వయసులో కుటుంబ భారంను మోసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో సెక్స్ వర్కర్‌గా బార్ డాన్సర్‌గా మారినట్లుగా చెప్పుకొచ్చింది.