Advertisement

బాలీవుడ్ స్టార్‌ రైటర్‌ ఒకప్పుడు సెక్స్‌ వర్కర్‌

Posted : May 13, 2020 at 8:48 pm IST by ManaTeluguMovies

షాగుప్తా రఫీక్‌ పేరు సౌత్‌లో పెద్దగా తెలియక పోవచ్చు. కాని ఉత్తరాదిన ఈమె పేరు గత రెండు మూడు సంవత్సరాలుగా మారుమ్రోగిపోతుంది. ఈమె రచయితగా ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌లో ఉంది. హిందీలో ఈమె చేస్తున్న సినిమాల జాబితా చూస్తే బాబోయ్‌ అనాల్సిందే. ఈమె ఆషికి 3 కి కథ అందించడంతో ఆమె రచయితగా స్టార్‌డం దక్కించుకుంది. హిందీలో ప్రస్తుతం స్టార్‌ హీరోల సినిమాల కథా చర్చలకు కూడా ఆమెనే ఆహ్వానిస్తారు.

ఇంతటి స్టార్‌డం దక్కించుకున్న రచయిత్రి షాగుప్తా రఫీక్‌ గతంలో ఒక సెక్స్‌ వర్కర్‌. బార్‌ డాన్సర్‌గా చేయడంతో పాటు చాలా ఏళ్లు సెక్స్‌ వర్కర్‌గా చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్‌ విషయాలను వెళ్లడి చేసింది.

తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాను. ఇప్పటికి కూడా నా తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ నేను పుట్టాను అనే విషయం నాకు తెలియదు. ఒక మహిళ నన్ను దత్తత తీసుకుని పెంచింది. ఆమె భర్త చనిపోవడంతో కుటుంబ భారం నాపై పడినది. 16 ఏళ్ల వయసులో కుటుంబ భారంను మోసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో సెక్స్‌ వర్కర్‌గా బార్‌ డాన్సర్‌గా మారినట్లుగా చెప్పుకొచ్చింది.


Advertisement

Recent Random Post:

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నివాసానికి చేరుకున్న రామ్ చరణ్ గారు | Ram Charan | Pithapuram | JSP

Posted : May 11, 2024 at 2:19 pm IST by ManaTeluguMovies

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నివాసానికి చేరుకున్న రామ్ చరణ్ గారు | Ram Charan | Pithapuram | JSP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement