Advertisement

మరో సౌత్ సినిమా రీమేక్ కు ఓకే చెప్పిన షాహిద్?

Posted : June 18, 2020 at 6:14 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నా, స్టార్ ఇమేజ్ ఎప్పుడో సంపాదించేసినా ఒక రేంజ్ ను మించి టాప్ లీగ్ లోకి చేరలేకపోయాడు. అయితే గతేడాది తెలుగు సినిమా అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ టైటిల్ తో రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా విడుదల సమయంలో ఎంత బజ్ సాధించిందో అందరికీ తెలిసిందే. షాహిద్ కపూర్ తొలిసారి ఈ సినిమాతోనే 200 కోట్ల క్లబ్ లో స్థానం కూడా సంపాదించాడు.

కబీర్ సింగ్ ఇచ్చిన ఊపుతో మరో తెలుగు సినిమా రీమేక్ కు షాహిద్ పచ్చజెండా ఊపిన విషయం తెల్సిందే. తెలుగులో నాని హీరోగా వచ్చి మంచి పేరు సంపాదించుకున్న జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నాడు. తెలుగు వెర్షన్ ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ ఇప్పటికే మొదలైనా కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది.

ఇక ఈ సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే షాహిద్ మరో రీమేక్ కు ఓకే చెప్పాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తెలుగు సినిమా కాదు, తమిళ చిత్రాన్ని రీమేక్ చేస్తాడట. తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కి తెలుగులో ఆకాశమే నీ హద్దురా టైటిల్ తో విడుదల కావాల్సిన చిత్రాన్ని షాహిద్ రీమేక్ చేస్తున్నాడంటున్నారు. నిర్మాత గుణీత్ మోంగా ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. దర్శకుడు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

YS Sharmila Fires On CM Chandrababu, Dy CM Pawana Kalyan And YS Jagan

Posted : September 27, 2024 at 6:07 pm IST by ManaTeluguMovies

YS Sharmila Fires On CM Chandrababu, Dy CM Pawana Kalyan And YS Jagan | Ntv

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad