Advertisement

`అర్జున్ రెడ్డి` భామకు కలో నిజమో అర్ధం కాలేదుట

Posted : September 23, 2021 at 7:59 pm IST by ManaTeluguMovies

`అర్జున్ రెడ్డి` భామ షాలినీ పాండే ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ నాయికగా మారుతోంది. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన అనంతరం ఉత్తరాది సినిమాలపైనే దృష్టి నిలిపింది. దీంతో కెరీర్ ఆరంభంలోనే షాలినికి రణవీర్ సింగ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం రణవీర్ సరసన` జయేశ్ భాయ్ జోర్డార్` చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దివ్యాంగ్ టక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే మహరాష్ట్రలో ఇంకా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. ఇంకా దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఇదే పరిస్థితి.

కొవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వాల ఆదేశాల మేరకు థియేటర్లు లాక్ లోనే ఉన్నాయి. కొన్ని చోట్ల అన్ లాక్ అయినా 50 శాతం ఆక్యుపెన్సీతోనే రన్నింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో షాలిని పాండే తన మనసులో కోర్కెల్ని.. ఆశల్ని బయటపెట్టింది. రణవీర్ సింగ్ తో నటిస్తోన్న తొలి చిత్రమిది. రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అదీ దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్లలలో రిలీజ్ అయితే నన్ను నేను తెరపై చూసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు. నా తల్లిందడ్రులు ఎంతో ఆశగా ఉన్నారు. ఏడాదిన్నర కాలంగా మేమంతా ఎంతో వెయిట్ చేస్తున్నాం. హిందీ లో నటిస్తున్న తొలి పెద్ద సినిమా ఇదే కావడంతోనే ఇంత ఉత్సాహంగా ఉన్నాను. నా ఎమోషన్స్ అదుపు తప్పుతున్నాయి. రిలీజ్ అయ్యేవరకూ ఆగలేకపోతున్నాను.

అంతగా ఈ సినిమా నన్ను ప్రభావితం చేసింది. వీలైనంత త్వరగా థియేటర్లో రిలీజ్ అవుతుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేసింది. యశ్ రాజ్ బ్యానర్లో సినిమా చేయడం ఇప్పటికీ కలో నిజమో అర్ధం కావడం లేదు. ఇలా అనుకునే లోపే మరో రెండు సినిమా ఛాన్సులు అదే బ్యానర్ లో వచ్చాయి. యశ్ రాజ్ బ్యానర్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు అదే బ్యానర్లో ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాను. ఈ బ్యానర్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోవాలని ఉందని షాలిని పాండే తెలిపింది.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 23rd November 2024

Posted : November 23, 2024 at 10:15 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 23rd November 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad