Advertisement

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ నెల సంపాదన ఎంతో తెలుసా..?

Posted : April 29, 2021 at 8:12 pm IST by ManaTeluguMovies

షన్నూ అలియాస్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌.. యూట్యూబ్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు పెద్దగా పరిచయం అ‍క్కర్లేని పేరు ఇది. యూట్యూబ్‌లో అతడు సృష్టించే రికార్డ్స్‌ మామూలుగా ఉండవు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్‌, లైకులు మనోడి వీడియోలకు వస్తాయి. షణ్ముఖ్‌ ఒక్క వీడియో పోస్ట్‌ చేశాడంటే.. అది ట్రెండింగ్‌లో ఉండాల్సిందే. అదీ అతడి క్రేజ్‌.
మొదట్లో కామెడీ, డాన్స్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్‌ .. ఒకే ఒక వెబ్‌ సిరీస్‌తో ఫేమస్‌ అయిపోయాడు. అదే ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’. ఈ వెబ్‌ సిరీస్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో పది ఎపిసోడ్స్‌కు 80 మిలియన్స్‌ పైగా వ్యూస్‌ వచ్చాయి. ది సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ కంటే ముందు షణ్ముఖ్‌ కొన్ని వెబ్‌ సిరీస్‌లలో నటించాడు. కానీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ సూప‌ర్ సిరీస్‌తో షణ్ముఖ్‌ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌, సబ్‌స్క్రైబర్స్‌ సంపాదించగలిగాడు.

ఈ వెబ్‌ సిరీస్‌ తర్వాత షణ్ముఖ్‌ షేర్‌ చేస్తున్న ప్రతి వీడియో 10 మిలియన్స్‌ పైగా వ్యూస్‌ వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘సూర్య’ అనే వెబ్‌ సిరీస్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదల చేసిన 6 ఎపిసోడ్స్ ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌లో షన్నూకు వచ్చిన క్రేజీతో ఇప్పుడు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి కూడా సెలెక్ట్‌ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, యూట్యూబ్‌లో ఇంతలా దూసుకెళ్తున్న షణ్ముఖ్‌ ఆదాయానికి సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. షణ్ముఖ్‌ యూట్యూబ్‌ చానల్‌కు ప్రస్తుతం 3.32 మిలియన్స్‌ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారని, ఆ లెక్కన ఈయనకు నెలకు రూ.7లక్షల వరకు ఆదాయం వస్తుందని ప్రచారం జరుగుతోంది. అలాగే షన్నూ చేసే వెబ్‌ సిరీస్‌కి ఎపిసోడ్‌ ప్రకారం రెమ్యునరేషన్‌ తీసుకుంటాడట. వాటిని కూడా కలిపితే.. ఈ యూట్యూబ్‌ స్టార్‌ నెలకు దాదాపు రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Gold Price: Trump Victory Effects Gold & Silver Rates in India

Posted : November 7, 2024 at 2:20 pm IST by ManaTeluguMovies

Gold Price: Trump Victory Effects Gold & Silver Rates in India

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad