తాను తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని సీఎం జగన్ సోదరి షర్మిల అన్నారు. ఈమేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ఈ ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్‌గా వచ్చిన వార్త నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్సార్‌గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పత్రిక అయినా, ఏ చానల్ అయినా ఓ కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పు. అది నీతిమాలిన చర్య. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్ మీద న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని తెలియజేస్తున్నా’ అని షర్మిల ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆ కథనానికి ఫుల్ స్టాప్ పడినట్టైంది. మొత్తంగా అన్నయ్య జగన్ తోనూ, కుటుంబంలోనూ విబేధాలు లేవని ఆమె చెప్పినట్టైంది.
పార్టీ ఏర్పాటు వార్తలపై వైఎస్ షర్మిల ఆగ్రహం..! ప్రకటన విడుదల
Advertisement
Recent Random Post:
అమరావతికి మహర్దశ.. రాజధాని నిర్మాణానికి 3 వేల కోట్లు | Amaravati Capital Region Funds in Budget
అమరావతికి మహర్దశ.. రాజధాని నిర్మాణానికి 3 వేల కోట్లు | Amaravati Capital Region Funds in Budget