లాక్ డౌన్ ఎందరినో చిక్కుల్లో పడేసింది. బ్యాంకులకు నెలవారీ వాయిదాలు కట్టే వారి పరిస్థితి మరీ ఘోరం. ఆర్బీఐ కొన్నాళ్ల పాటు మారటోరియం వెసులుబాటు కల్పించినా కానీ తిరిగి ఆ ఈఎంఐలు అన్నీ కట్టాల్సిందే. ఇలాంటి వేళ చాలామంది ఖరీదైన వస్తువులు ప్రాపర్టీల కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. ఈఎంఐ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే అందాల కథానాయిక శ్రుతిహాసన్ మాత్రం అంత స్మార్ట్ గా యాక్ట్ చేయలేకపోయానని ఇల్లు కొని బుక్కయ్యానని చెబుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో తెలివిగా ఆలోచించలేకపోయానని .. అందరిలానే తనకు కూడా ఆర్థికంగా కష్టం ఎదురైందని వెల్లడించింది.
ఇల్లు కొన్న అప్పు తీర్చాలంటే సినిమాల్లో నటించాలి. కానీ అందుకు ఈ పరిస్థితుల్లో అవకాశం లేదు. దీంతో ఇబ్బందుల్లో ఉన్నానని శ్రుతిహాసన్ అనడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇకపోతే అప్పు ఉంది కదా అని తన తల్లిదండ్రులను అడిగి తీర్చదట. తాను స్వతంత్య్రభావాలున్న అమ్మాయినని తన అప్పు తానే తీర్చేసుకుంటానని చెబుతోంది. అయితే ప్రస్తుత సెకండ్ వేవ్ సన్నివేశంలో ఎప్పటికి షూటింగులు ప్రారంభమవుతాయి. ఎప్పుడు సినిమాలు పూర్తి చేసి పారితోషికాలు అందుకోవాలి? ఎప్పటికి బాకీలు తీర్చాలి? అన్నదే సస్పెన్స్ గా మారింది.