Advertisement

చనిపోయాడు అంటున్నా ‘నో ప్రాబ్లం’

Posted : July 19, 2021 at 4:37 pm IST by ManaTeluguMovies

సెలబ్రెటీల గురించి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వార్తలు ప్రసారం అవ్వడం చాలా కామన్ అయ్యింది. కొన్ని పుకార్లు ప్రచారం అయితే పర్వాలేదు అనుకుంటారు కాని కొందరు సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ ల్లో చనిపోక ముందే చనిపోయారు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. తమ వ్యూస్ కోసం బతికి ఉన్న వారిని చంపేస్తున్నారు.. లేని పోని అక్రమ సంబంధాలు అంట కడుతున్నారు.. కలిసి ఉన్న భార్య భర్తలను ప్రేయసి ప్రియులను విడదీస్తున్నారు. ఇంట్లో రకరకాలుగా సోషల్ మీడియా వారు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఆ ఛానెల్స్ లో ఉండే కంటెంట్ లో కనీసం 10 శాతం కూడా నిజం ఉండటం లేదు. అయినా కూడా యూట్యూబ్ ఆ ఛానెల్స్ ను కొనసాగించేందుకు ఓకే చెప్తోంది. ఈ విషయమై పలువురు సెలబ్రెటీలు యూట్యూబ్ ను నిలదీస్తున్నా కూడా ఫలితం మాత్రం శూన్యం అన్నట్లుగా ఇంది.

హీరో సిద్దార్థ్ చనిపోయాడు అంటూ మూడు సంవత్సరాల క్రితం ఒక యూట్యూబ్ ఛానెల్ లో వీడియో వచ్చింది. ఆ వీడియో లో చనిపోయిన కొద్ది మంది సినీ ప్రముఖులతో పాటు సిద్దార్థ్ ను కూడా చేర్చారు. హీరో సిద్దార్థ్ చిన్న వయసులో చనిపోయిన సెలబ్రెటీ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. హీరోయిన్స్ గా మంచి ఫేమ్ లో ఉన్న సమయంలోనే ఆర్తి అగర్వాల్ మరియు సౌందర్యలు చనిపోగా హీరో సిద్దార్థ్ కూడా కెరీర్ బాగా ఉన్న సమయంలోనే చనిపోయాడు అంటూ థమ్ నైల్ లో పేర్కొన్నారు. వీడియోలో మ్యాటర్ ఉన్నా లేకున్నా కూడా ఇలా థమ్ నైల్ పెట్టేస్తూ ఉంటారు.

ఇటీవల సందీప్ అనే వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హీరో గురించి ఈ వార్త ఏంటీ అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయ్యో నేను చనిపోయానా.. ఆ విషయం తెలియక ఇంకా సినిమాలు తీస్తూ పోతున్నా కదా అంటూ మీమ్ కూడా క్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. ఆ వీడియో లింక్ ను కూడా అతడు షేర్ చేశాడు. అతడి ట్వీట్ లో సిద్దార్థ్ ను ట్యాగ్ చేశాడు. ఆ ట్వీట్ కు స్పందించిన సిద్దార్థ్ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ వీడియోను రిపోర్ట్ చేస్తూ యూట్యూబ్ కు ఫిర్యాదు చేశాను.

నేను చనిపోక ముందే చనిపోయినట్లుగా అందులో చూపించారంటూ నేను చేసిన ఫిర్యాదును యూట్యూబ్ పట్టించుకోక పోవడంతో పాటు అందులో ఎలాంటి ప్రాబ్లం లేదని రిప్లై ఇచ్చారు. నేను చనిపోయినట్లుగా థమ్ నైల్ ఉన్న వీడియో పై ఫిర్యాదు చేస్తే నో ప్రాబ్లం అన్నట్లుగా యూట్యూబ్ సమాధానం ఇచ్చిందంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. యూట్యూబ్ తీరును సిద్దార్థ్ కు మద్దతుగా చాలా మంది విమర్శిస్తున్నారు. మరీ ఇలాంటి వీడియోలను పెట్టే వారు.. థమ్ నైల్స్ ను పెట్టే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Burning Topic : కల్తీ విశ్వరూపం! | Adulterated food items flood Hyderabad markets

Posted : November 20, 2024 at 10:48 pm IST by ManaTeluguMovies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad