Advertisement

మామిడి కాయని షేర్ చేస్తే అలా అనేస్తారా

Posted : April 24, 2022 at 1:16 pm IST by ManaTeluguMovies

స్టార్ సింగర్ సునీత కెరీర్ పరంగా హ్యాపీగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సింగర్ గా ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్న సునీత నిత్యం ప్రోఫెషనల్ గా బిజీగానే ఉంటారు. విదేశీ ఈవెంట్లలో సైతం చురుకుగా పాల్గొంటారు. ఆ రకంగా వృత్తి పరంగా ఎప్పుడూ బిజీనే. ఇక గేతడాది వ్యాపారవేత్త రామ్ వీరపనేని- సునీత రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వృత్తి పరంగా భర్త సహకారం ఎప్పుడూ సునీతకి లభిస్తుంది.

ఇక సునీత్ సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. వృత్తికి సంబంధించిన విషయాలతో పాటు అప్పుడప్పుడు కొత్త కొత్త ఫోటోలని షేర్ చేస్తుంటారు. సోషల్ మీడియా లో భారీ ఫాలోయింగ్ ఉంది. సునీత అంటే ఆరాదించే అభిమానులెంతో మంది ఉన్నారు. సునీత ఫోటోలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. తాజాగా మామిడి తోటలో..పచ్చి పుల్ల మామిడి కాయని చేతితో టచ్ చేసి ఉన్న ఓఫోటోని షేర్ చేసారు. దానికి `బ్లెస్డ్` అంటూ ఓ ఆసక్తికర క్యాప్షన్ కూడా ఇచ్చారు.

దీంతో కొంత మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. సునీత తల్లికాబోతుంది అంటూ కామెంట్లు పోస్ట్ చేసారు. దీంతో ఆ మామిడి కాయ ఫోటో…తల్లి కాబోతున్న వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సునీత్ షాక్ కి గురైంది. మామిడి కాయ ఫోటోని షేర్ చేస్తేనే ఇంతలా ఊహించుకోవాలా? అన్న తీరున స్పందించారు.

`ఓరి దేవుడా..జనాలు ఎంత క్రేజీ అసలు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. నేను మా మొదటి మామిడి పంటతో ఈ రోజు ఓ పోస్ట్ పెట్టాను. ఆ వార్త ఇలా వ్యాపించింది. కొంత మంది వేరేలా అర్ధం చేసుకున్నారు. దయచేసి ఇలాంటి వదంతలు..వార్తలు రాయకండి మీకో దండం రా నాయనా“ అని సునీత ఇన్ స్టాలో విజ్ఞప్తి చేసారు. దీంతో గర్భవతి అంటూ వస్తోన్న వెబ్ మీడియా కథనాలకి పుల్ స్టాప్ పటింది.

అయితే మరికొంత మంది నెటి జనులు మామిడి పళ్ల సీజన్ మొదలైంది కాబట్టి…ఆ సీజన్ ని ఉద్దేశించి సునీత ఆ పోస్ట్ పెట్టారని అభిప్రాయపడిన వాళ్లు ఉన్నారు. కారణాలు ఏవైనా పచ్చి మామిడి కాయ వెనుక సీక్రెట్ వేగంగానే వీడింది. లేదంటే ఈ వార్త ఇంకెన్ని రకాలుగా కట్టు కథనాలకి ఆస్కారం కల్పించేదో. అందుకే సునీత ముందుగానే అలెర్ట్ అయ్యారు.


Advertisement

Recent Random Post:

మోడీ అమెరికా టూర్ ప్రాధాన్యత ఏంటి..? అగ్రరాజ్యం మోడీని ఎలా చూస్తోంది..? | Chairman’s Desk

Posted : September 23, 2024 at 2:48 pm IST by ManaTeluguMovies

మోడీ అమెరికా టూర్ ప్రాధాన్యత ఏంటి..? అగ్రరాజ్యం మోడీని ఎలా చూస్తోంది..? | Chairman’s Desk

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad