దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది.. కానీ తీవ్రత మాత్రం తగ్గలేదు. గతంలో కంటే తక్కువగానే అయినా వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తతం కేంద్రంలోని ఓ ప్రజా ప్రతినిధి కరోనా బారిన పడ్డారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కోరోనా పాజిటివ్ కు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఇటివల తనతో సమావేశాలకు వచ్చిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.
కరోనా వైరస్ కు ఇటివల పలువురు కేంద్ర మంత్రులు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. వీరిలో అమిత్ షా, నితిన్ గడ్కరీ ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వైరస్ బారిన పడ్డారు. వీరంతా కోలుకున్నారు. ప్రస్తుతం స్మృతి ఇరానీ ఈ వైరస్ బారిన పడ్డారు.