ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని జగ్రత్తలు తీసుకుని పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ కూడా తప్పుబట్టింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి విపరీతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదని.. పరిక్షలు రద్దు చేయాలని కోరింది. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్ కు లేఖ రాశారు.
ప్రస్తుతం కోవిడ్ తీవ్రత చూసి విద్యార్ధుల్లోనే కాకుండా తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన నెలకొందన్నారు. విద్యార్ధులు పరిక్షలు రాయాలన్నా ప్రజా రవాణా ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది.. ఆపై కోవిడ్ ఇంకా విస్తరించే అవకాశం ఉంది అని అన్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈతోపాటు పలు రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని సోము వీర్రాజు గుర్తు చేశారు.