తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతానంటూ బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంటు మోనాల్ గజ్జర్ మీద ఎంతటి వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిందే. ఓ రకంగా ఆమెపై విద్వేషపూరితంగా మాట్లాడుతూ విషం చిమ్ముతున్నారు. ఆమె క్యారెక్టర్ మీద నింద వేస్తూ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు. నిజానికి మోనాల్ అంత పెద్ద తప్పేమీ చేయలేదు. ఆమె వృత్తి రీత్యా హీరోయిన్.. అయినా సరే వారమంతా సాధారణ దుస్తుల్లోనే కనిపించినప్పటికీ, వీకెండ్లో మాత్రం కాస్త ఎక్స్పోజింగ్ ఉండే బట్టలకు ప్రాధాన్యమిచ్చేది. దాన్నో ఘోర నేరంలా చాలా మంది తప్పుపట్టారు. ఇక రెండోది ఆమె అభిజిత్, అఖిల్ ఇద్దరినీ ఫ్రెండ్ అని భావించింది.
మోనాల్‌పై లెక్కలేనన్ని అభాండాలు
అఖిల్‌కు తొందరగా పడుకునే అలవాటు ఉండేది. దీంతో రోజంతా అఖిల్‌తో మాట్లాడినా, రాత్రి అభిజిత్‌తో కబుర్లు చెప్పేది. కానీ ఇది జనాలకే కాదు, తోటి కంటెస్టెంట్లకు కూడా వేరేలా అర్థమైంది. ఇక గుజరాతీ అమ్మాయి కావడంతో వచ్చీరాని తెలుగుతో పాటు హిందీలో ఎక్కువగా మాట్లాడేది. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత దూరమైంది. ఇంకా అబద్ధాల కోరు అని, కెమెరాల ముందు నటిస్తోందని ఇలా ఎన్నో అభాండాలు ఉండనే ఉన్నాయి. లేని పోని నిందలు వేస్తూ మోనాల్‌ను దారుణంగా అవమానించడాన్ని ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మోనాల్‌ను కాపాడమని సోనూసూద్‌ను వేడుకుంటున్నారు.
సోనూసూద్, మోనాల్‌కు సపోర్ట్ చేయండి
Advertisement
Recent Random Post:
Highlights of India’s Biggest Trailer Launch Event | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika | DSP
Highlights of India’s Biggest Trailer Launch Event | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika | DSP