నిజ జీవితం వేరు, సినీ జీవితం వేరు. సినిమాల్లో హీరోలుగా నటించే వారు బయట కూడా హీరోలు అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే సినిమాల్లో విలన్లుగా నటించే వారు బయట చాలా మంచోళ్ళు కూడా అవ్వొచ్చు. ఇప్పుడు సోను సూద్ విషయాన్నే తీసుకుంటే సినిమాల్లో కరుడుకట్టిన విలన్ పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరించిన సోను సూద్ ఈ లాక్ డౌన్ సమయంలో హీరో అయిపోయాడు.
లాక్ డౌన్ సమయంలో సోను సూద్ చేసిన సహాయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరిలో పెద్ద హీరో అయిపోయాడు. అలాంటి సోను సూద్ ఇకపై హీరో వేషాలకే పరిమితం అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఈ నటుడు స్పందించాడు. “నేను హీరోగా మాత్రమే చేస్తాను అనడం పొరబాటు. నేను హీరోగా చేస్తే ఎవరు చూస్తారు? నన్ను విలన్ గా మాత్రమే చూస్తారు అనుకోవడం పొరబాటు. దయచేసి నా కెరీర్ పై కొట్టొద్దు. నేను ఇంతకు ముందు ఎలాంటి పాత్రలను ఎంచుకుంటానో ఇకపై కూడా అలాంటి పాత్రలనే ఎంచుకుంటాను” అంటూ సోను సూద్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమాలో సోను సూద్ నటిస్తున్నాడు.