Advertisement

ప్యాన్ ఇండియా స్టార్లు.. అంతటా వాలిపోతున్నారు

Posted : July 15, 2021 at 9:24 pm IST by ManaTeluguMovies

‘ఉదయం టిఫిన్ హైదరాబాద్.. మధ్యాహ్నం లంచ్ ముంబైలో.. సాయంత్రం డిన్నర్ దుబాయ్ లో’ చేస్తాడు అంటూ ప్రముఖుల విలాసాలపై అప్పట్లో సినిమాలో ఓ డైలాగ్ ఉండేది. ఆయన అంత బిజీ పర్సన్ అని చాటేందుకు ఈ డైలాగ్ వాడేవారు.కానీ ఇప్పుడు అదే నిజమయ్యేలా పరిస్థితి ఉంది.

ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారైంది. ఏ దేశంలో ఎప్పుడు ఎవరైనా చేరుకునేంతగా రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. భూమ్మీద చాలాక ఈ మధ్య ఆకాశంలోకి కూడా వెళ్లి వస్తున్నారు. భూమిని అంత ఎత్తునుంచి తొంగి చూస్తున్నారు. అలాంటి వ్యవహారం సినిమాల్లోనూ వచ్చింది.

ఎక్కడో భారత్ లోని తెలుగు భాష తెలుగు సినిమా ‘బాహుబలి’ ప్రపంచాన్ని మెప్పించింది. తెలుగు సినిమాను ఎల్లలు దాటించింది. ఇప్పుడు తెలుగోళ్లు ప్యాన్ ఇండియా స్టార్లుగా మారారు. దేశంలోని అన్ని భాషల్లోకి సినిమాలను విడుదల చేస్తున్నారు.

ప్రభాస్ ఇప్పటికే ముంబైలో ఇల్లు తీసుకొని అక్కడా సెటిల్ అయిపోతున్నారు. రాంచరణ్ సైతం ఇటీవల ముంబైలో ఫ్లాట్ తీసుకున్నాడు. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్2’ సహా పలు సినిమాల్లో వెబ్ సిరీస్ లలో అవకాశాలు రావడంతో సమంత కూడా ముంబైలో ఇల్లు తీసుకునేందుకు రెడీ అవుతోందట..

దక్షిణాది హీరోలందరూ కూడా ఇప్పుడు ముంబైలో ఇళ్లు ఫ్లాట్లు కొంటున్నారు. రాంచరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ విజయ్ దేవరకొండ రష్మిక యష్ దుల్కర్ సల్మాన్ తోపాటు చాలామంది ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్లుగా మారి బాలీవుడ్ కేంద్రంగా ఉన్న ముంబైలో తిష్టవేస్తున్నారు.

ఇక బాలీవుడ్ లో వెలుగు వెలుగుతున్న హీరోలు సినీ ప్రముఖులు సైతం హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. బాలీవుడ్ హీరో హీరోయిన్లు హైదరాబాద్ లో ఇళ్లు స్థలాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా అన్ని వసతులు ఉన్న ఫిల్మ్ సిటీలు మంచి మేకర్స్ నిర్మాణ సంస్థలు వసతులు ఉండడంతో ఇక్కడ షూటింగ్ కోసం వచ్చినప్పుడు ఇబ్బందిపడకుండా ఇలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ముంబైలో ఉండే రియల్ హీరో సోనూ సూద్ కు సైతం తెలుగులో బోలెడు అవకాశాలువస్తున్నాయి. హిందీలో కంటే తెలుగులోనే సోనూ సూద్ నటిస్తున్నసినిమాలు ఎక్కువ. ఈ మద్య పారితోషికం కూడా భారీగానే పెంచేశాడు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ కాలం హైదరాబాద్లోనే సోనూ సూద్ ఉండాల్సి వస్తోంది.హైదరాబాద్ కు ఎప్పుడొచ్చినా పార్క్ హయత్ హోటల్ లోనే సోనూ సూద్ బస చేసేవారు. ఇప్పుడు సోనూ సూద్ కేరాఫ్ హైదరాబాద్ గా మార్చుకుంటున్నాడట..

హైదరాబాద్ లో ఎక్కువ కాలం షూటింగ్ లు ఉండడంతో ఇక్కడే ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని సోనూ సూద్ నిర్ణయించుకున్నాడట.. ఇందులో భాగంగానే బంజారాహిల్స్ లో రూ.10 కోట్లతో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే గృహ ప్రవేశం చేయబోతున్నారట..

సోనూ సూద్ కు ముంబైలో ఓ సొంత ఇల్లు ఉంది. ఆయన అక్కడే ఉంటారు. కానీ తెలుగు సినిమాల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ కొత్త ఇంట్లో మకాం పెడుతారు.సోనూ వ్యక్తిగత వ్యవహారాలు సామాజిక సేవ కథా చర్చలకు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే నిర్మాతలు దర్శకులకు ఈజీ అవుతుందని ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలని యోచిస్తున్నాడట..

అలా సినిమా స్టార్లు అందరూ ఇప్పుడు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వాలిపోతున్నారు. మొత్తం గ్లోబలైజేషన్ పుణ్యమాని స్టార్లు అందరూ ప్రతీచోట తమ నివాసాలను ఏర్పాటు చేసుకుంటూ అనుకూలంగా బతికేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

ఈటల నిండు నూరేళ్లు బతకాలి : Minister Gangula Kamalakar Comments On Etela Rajender

Posted : July 20, 2021 at 1:25 pm IST by ManaTeluguMovies

ఈటల నిండు నూరేళ్లు బతకాలి : Minister Gangula Kamalakar Comments On Etela Rajender

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement