అనారోగ్యంతో మృతి చెందిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు నేడు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలో జరుగుతున్నాయి. కరోనా కారణంగా అతి కొద్ది మంది మాత్రమే బాలు అంతిమ సంస్కారాల్లో పాల్గొననున్నారు. ఆయన అభిమానులు ఎవరికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. బాలు గారి అంత్య క్రియలను వీర శైవ జంగమ సాంప్రదాయంలో నిర్వహిస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ సాంప్రదాయం ప్రకారం మృతదేహంను కూర్చున్న పొజీషన్ లో నే ఖననం చేస్తారు. తనకు ఎంతో ఇష్టమైన తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రంలో బాలు గారి అంత్యక్రియలు జరుగుతున్నాయి. దగ్గరి బందువులు మరియు ముఖ్యమైన రాజకీయ నాయకులు ప్రభుత్వ వర్గాల వారు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారంటూ ఇప్పటికే కుటుంబ సభ్యులు తెలియజేశారు. కరోనా మహమ్మారి కారణంగా వేలాది మంది ఆయన కడసారి చూపుకూడా దక్కలేదు అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.